భారతదేశ ఆర్థిక ప్రణాళిక మరియు ఆర్థిక నిర్వహణను అర్ధం చేసుకోవడానికి ఆర్థిక సర్వే మరియు బడ్జెట్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం విడుదల చేసే ఈ పత్రాలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్రలను పోషిస్తాయి. అసలు ఇక్కడ ముందు "ఆర్థిక సర్వే" అంటే ఏమిటి? అనేది తెలుసుకోవాలి. ఆర్థిక సర్వే అనేది ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ప్రచురించే ఒక పత్రం అని చెప్పుకోవచ్చు. ఆర్థిక సర్వే నివేదిక అనేది గత కొన్ని సంవత్సరాలుగా దేశం యొక్క ఆర్థిక పనితీరుకి విశ్లేషణను అందిస్తూ రాబోయే మరియు ప్రస్తుత ప్రభుత్వ విధాన కార్యక్రమాలపై వివరణ అందిస్తుంది.

ఇక కేంద్ర బడ్జెట్ అనేది భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రచురించే ఆర్థిక నివేదిక అని అందరికీ తెలిసిందే. ఇది పూర్తిగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేయబడిన రాబడి మరియు వ్యయాల వివరాలను ప్రదర్శిస్తుంది. ఇది దేశం యొక్క ఆర్థిక నిర్వహణ మరియు దాని ఆర్థిక విధానాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించబడే పత్రం అని చెప్పుకోవచ్చు.

ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే మరియు బడ్జెట్‌ల మధ్య రాజ్యాంగపరమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే, ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో విభిన్న చట్టపరమైన మరియు విధాన పరమైన ఫ్రేమ్‌వర్క్‌లను పరిపుష్టంగా ప్రదర్శిస్తుంది కాబట్టి. ఆర్థిక సర్వే నివేదిక అనేది రాజ్యాంగ పరిమితి కావలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ యొక్క పూర్తి మరియు మొత్తం సమీక్షను అందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది దీనిని సిద్ధం చేస్తుంది. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం యూనియన్ బడ్జెట్ అనేది రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి అయ్యి ఉంటుంది. యూనియన్ బడ్జెట్‌లో చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ప్రతిపాదనలు ఉంటాయి కాబట్టి వీటిని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: