ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న హత్యలు దాడులు హింసాత్మకమైన ఘటనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇవన్నీ రాజకీయ హత్యలే అంటూ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయి అంటూ దీంతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో ఎన్నడు లేనివిధంగా శాంతి భద్రతలు కూడా ఏపీలో క్షీణించాయంటూ వినుకొండలో జరిగిన రషీద్ అని యువకుడి హత్య ఘటనకు సంబంధించి అలాగే పుంగనూరులో మిధున్ రెడ్డి పైన రాళ్లదాడి ఇలా సంఘటనలను జగన్ అన్నిటిని కూడా గవర్నర్కు వివరించారు.


అందుకు  తగ్గట్టుగా విధివిధానాలను చర్యలు తీసుకోవాలంటు వైసీపీ అధినేత జగన్ తెలియజేశారు. ఇదే అంశం పైన ఢిల్లీ వేదికగా కూడా పోరాటం చేస్తామంటూ వైసీపీ జగన్ తెలియజేశారు. రాష్ట్రంలో జరిగిన ఈ హత్యల దారుల పైన వినిపించబోతున్నట్లు తెలిపారు దేశ రాజధానిలో జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలి అంటూ విపక్ష పార్టీలకు సైతం జగన్ ఆహ్వానం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నది.


జులై 24న న్యూఢిల్లీలో అందుకు సంబంధించి నిరసన కార్యక్రమం కూడా చేయబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను సైతం ఆహ్వానించడం తోపాటు దేశ రాజధానిలో నిరసన నిర్వహించడం ద్వారా అన్ని పార్టీలకు హెచ్చరికగా ఉంటుందని తెలియజేస్తున్నారు.అలాగే రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్ కూడా జగన్ కోరారని  రాగానే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూడా వివరిస్తామంటూ తెలియజేశారు. ఏపీలో హింస పెరుగుతోందని శాంతి భద్రతలకు టిడిపి పార్టీ తావు ఇవ్వలేదంటూ తెలియజేశారు. ముఖ్యంగా ఆస్తుల విధ్వంసానికి కూడా వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభలలో వైసీపీ ఎంపీలు కూడా మాట్లాడే విధంగా ప్లాన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: