గత కొద్ది రాజుల నుంచి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అధికారుల మీద కేసు పెట్టడం జరిగింది. రఘురామకృష్ణం రాజు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి.. ఏవైతే తనను కొట్టారని దాడి చేశారని.. తన మీద హత్య ప్రయత్నం జరిగిందని చంపబోయారని కేసు పెట్టడం జరిగింది. గతంలో దానిమీద సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.. ఆ తర్వాత వాటిని విత్డ్రా చేసుకున్నారు. అదంతా ఇష్యూ కూడా నడిచింది.. ఇప్పుడు ఆయన ఏం చేయదలుచుకున్నారనే విషయానికి వస్తే.. గుంటూరు ఎస్పీకి కంప్లైంట్ చేశారు.. దానిమీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ అయింది.



ముఖ్యంగా తన మీద దాడి చేసిన వారిలో ఒక పొట్టి అతను ఒక పొడుగు అతను ఉన్నారని.. ముసుగేసుకుని వచ్చి తన మీదికి దాడి చేశారని తెలియజేశారు. ఇంతకుముందు గుర్తుపట్టలేనన్నారు ఇప్పుడు గుర్తు పడతానని తెలుపుతున్నారు.. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే నిజమైనటువంటి ఎవిడెన్స్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు.. రఘురామకృష్ణంరాజుకు ఎంత అయితే ఆప్షన్ ఉంటుందో అదే ఆప్షన్ అక్కడ ఐపీఎస్ సునీల్ కు కూడా అంతే ఆప్షన్ ఉంటుంది.. ఆయన డిజి ర్యాంక్ అధికారి కావడం కీలకమైన అంశము..


రఘురామ కృష్ణంరాజు విజయపాల్, సునీల్ ని కేవలం టార్గెట్ చేస్తున్నారు.. వీరిద్దరూ కూడా ఒకరు మాల మరొకరు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. వీళ్ళ మీద అనేది సాక్షాలు పక్కాగా ఉండాలి. ఎవిడెన్స్లు రెండు రకాలు ఉంటాయి అందులో ఒకటి పర్ఫెక్ట్ ఎవిడెస్, ప్లాంటెడ్ ఎవిడెన్స్.. ఇందులో ఫర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉంటే ఏం పర్వాలేదు.. అలాగే గాయాల మీద కూడా డాక్టర్ల పై కూడా రఘురామ కృష్ణంరాజు కేసు వేశారు.. తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని కూడా తెలిపారు.. ముఖ్యంగా సాక్ష్యం చెప్పాలి అంటే అందులో ఉన్న అధికారులే చెప్పాలి తన ముందరే కొట్టారని కూడా తెలియజేయాల్సి ఉంటుంది.. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కింద తప్పుడు సాక్ష్యం చెబితే ఎవరైతే చెప్పారో..అలా చెప్పిన వారికి సృష్టించిన వారికి జైలు శిక్ష ఉంటుంది.. రఘురామకృష్ణంరాజుకు ఆర్థిక బలం, అంగ బలం ఎలా ఉందో వారికి కూడా లీగల్ బలం కుల బలం కూడా చాలానే ఉన్నది.. మరి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: