ఢిల్లీకి చెందిన అమితా ప్రజాపతి తను కన్న కలకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా వాటిని అవలీలగా చేధించుకుంటూ కెరీర్ పరంగా ముందడుగులు వేశారు. పదేళ్ల కష్టానికి తగ్గ ఫలితం దక్కడంతో అమితా ప్రజాపతి తండ్రిని గట్టిగా హత్తుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పదేళ్ల కష్టానికి తగ్గ ఫలితం దక్కడంతో ఆమె కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయని తెలుస్తోంది.
తన కూతురు సక్సెస్ గురించి తెలిసి తండ్రి మనస్సు సంతోషంతో ఉప్పొంగిపోయిందని సమాచారం అందుతోంది. నాన్నా.. నేను ఛార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను అంటూ లింక్డ్ ఇన్ వేదికగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. గత పదేళ్లుగా ఎన్నో బాధలను దిగమింగుకుని ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె చెపుకొచ్చారు. తండ్రి టీ అమ్ముతూ చదివించగా ఆమె తండ్రి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించారు.
కష్టపడితే ఆలస్యంగా అయినా లక్ష్యాన్ని సాధించవచ్చని ఈ యువతి ప్రూవ్ చేశారు. సీఏ కావాలని భావించే ఎంతోమంది అమితను చూసి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. కష్టాన్ని నమ్ముకోవడం ద్వారా దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే అవకాశం అయితే ఉంటుంది. అమితా ప్రజాపతి భవిష్యత్తులో ఎన్నో విజయాలను అందుకోవాలని ఆశిద్దాం. అమిత యంగ్ జనరేషన్ లో ఎంతోమంది లక్ష్యాలను సాధించడానికి సపోర్ట్ గా నిలిచారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.