ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు మున్సిపాలిటీ కౌన్సిలర్లను తమ ఖాతాలో వేసుకునేలా టిడిపి పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అలాగే కొంత మంది పార్టీ నేతలను కూడా టిడిపిలోకి ఆహ్వానించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు తెలియజేశారు.



2019లో టిడిపి పార్టీ అభ్యర్థిగా దిగిన ఈయన గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత వైసిపి పార్టీలోకి చేరారు. ప్రస్తుతం వైసీపీ గుంటూరు నగరి పార్టీ నుంచి అధ్యక్షుడు గానే ఈయన కొనసాగుతూ ఉన్నట్లు తెలుస్తోంది. మద్దాలి గిరిధర్ రావు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు నేతలు పార్టీని విడుతున్న తరుణంలో ఇప్పుడు వైసీపీ పార్టీని గుంటూరు నగరి పార్టీ అధ్యక్ష పదవితో పాటు వైసిపి క్రియాశీలక సభ్యత్వానికి కూడా ఈయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.


అయితే ఈయన రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆలోచనతోనే వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలియజేస్తున్నారు. కానీ ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా లేకపోతే మళ్ళీ తిరిగి టిడిపి పార్టీలోకి చేరతారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.. ప్రస్తుతం వైసీపీ నేతల పైన జరుగుతున్న దాడుల పైన వైయస్సార్సీపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా నిరసనలు తెలియజేయబోతున్న సమయంలో వైసీపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పడం కార్యకర్తలలో కాస్త నిరాశని వ్యక్తం చేస్తోంది. మరి రాబోయే ఐదేళ్లలో ఎవరెవరు పార్టీలో ఉంటారు ఎవరు ఉండరు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.. కేవలం 11 స్థానాలకి 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: