•  పార్లమెంటులో ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా నిలిచిన నిర్మలా సీతారామన్!
* అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డ్ సృష్టించిన నిర్మలా సీతారామన్!
* వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనత దక్కించుకున్న నిర్మలా సీతారామన్!


ఢిల్లీ - ఇండియా హెరాల్డ్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడోదఫా ఎన్నికైన తర్వాత మొదటి బడ్జెట్ ని ప్రవేశపెడుతోంది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగంపై సర్వత్ర  ఆసక్తి అనేది నెలకొని ఉంది.ముఖ్యంగా ఎన్నికల హామీలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏఏ రంగాలపై వరాల జల్లు కురుస్తుందన్న చర్చ సాగుతుంది. కొత్త సంక్షేమ పథకాల ప్రకటన, వేతన జీవులకు పన్నుమినహాయింపులు ఇంకా అలాగే పారిశ్రామిక వర్గాలకు పన్ను మినహాయింపులు వంటి వార్తలు వినేందుకు పలు వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఇలా బడ్జెట్ ప్రసంగంపై అన్ని రంగాల వారు కూడా ఆసక్తి చూపించడం సహజమే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ లో కేటాయింపులపై ఇరు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. పోలవరం సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులతో పాటు ఇంకా అలాగే ఇలా పలు అంశాలపై ఈ సారి కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటనలు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.


జులై 23న అనగా నేడు ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రసంగంపై ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో ఓటాన్ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో NDAకి ఆశించిన ఫలితాలనేవి రాకపోవడంతో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో సామాన్యులకు వరాలు కురిపిస్తారనే అభిప్రాయాలు బాగా వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర బడ్జెట్లో  ప్రయోజనాలు ఏంటి ఆదాయపు పన్ను తగ్గుతుందా లేదా? ఇంకా  కొత్త పన్ను విధానం ఎలా ఉండనుంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. మౌలిక సదుపాయాలను పెంచడం నుంచి సామాజిక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పన్ను విధానాలను మార్చడం ఇంకా అలాగే ద్రవ్య లోటును తగ్గించడం మొదలైనవి ఎంతో ఆశాజనకంగా ఉండనున్నాయి. ఇదిలా ఉండగా వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు. ఎక్కువసార్లు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా ఆమె పేరిట నమోదయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: