అభివృద్ధి చెందిన దేశాలలో మన దేశాన్ని నిలపాలనే ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వం లక్ష్య సాకారం దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8 నెలల సమయం మిగిలి ఉండగా ఆ 8 నెలల కాలానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సమర్పిస్తున్న బడ్జెట్ కావడం కొసమెరుపు.
 
దేశంలో ధరలు మండిపోతున్న నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై ఆశలు పెట్టుకోగా మోదీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దుని ఈరోజు సమర్పించనుంది. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకం పాటించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. మోదీ సర్కార్ వృద్ధికి ఊతమిచ్చి ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫీలవుతున్నారు.
 
2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని మోదీ భావిస్తున్నారని భోగట్టా. కేంద్ర బడ్జెట్ పై లోక్ సభ, రాజ్యసభలలో 20 గంటల పాటు చర్చ జరగనుందని సమాచారం అందుతోంది. ఉద్యోగులు ప్రధానంగా ఏడు వరాలపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు బెనిఫిట్ కలిగేలా ఏవైనా నిర్ణయాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.
 
స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ను లక్ష రూపాయలకు పెంచాలని ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లను మార్చాలని సెక్షన్ 80సీ డిడక్షన్ లిమిట్ పెంపు, సేవింగ్స్ వడ్డీపై మినహాయింపు పెంపు, హౌసింగ్‌కి ప్రోత్సాహం, హౌస్ రెంట్ అలవెన్స్ ట్యాక్స్, కొత్త పన్ను విధానంలో సమానత్వం కావాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఉద్యోగులపై మోదీ వరాల జల్లు కురిపిస్తారో లేదో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కార్ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా బెనిఫిట్స్ అందించే వాటిపై దృష్టి పెడితే బెటర్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మోదీ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: