నిన్నటి రోజున అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్నిప్రమాదం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ముఖ్యంగా ఈ ఘటన పైన బిజెపి ద్వారక తిరుమల రావు పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. ఇది ప్రమాదం కాదని భావిస్తున్నామని ఆయన విచారణలో భాగంగా అన్ని విషయాలను కూడా త్వరలో బయటికి పెడతామని ఈ ఘటన జరిగిన ప్రాంతానికి 50 అడుగుల దూరంలో కాలుతున్న ఫైల్స్ కనిపించాయంటూ ఇది ఎవరో పక్క ప్లాన్ ప్రకారమే చేసినట్లుగా తెలుస్తోందని తెలిపారు.


రాత్రి 11:30 నిమిషాలకు ఈ ఘటన జరిగిందని మూడు గంటల పాటు విచారణ జరిపామని ఇది ప్రమాదంగా మాకు అనిపించడం లేదని కూడా తెలియజేశారు.. వెంటనే ఈ విషయాన్ని ఆర్డీవో ప్రసాద్ కలెక్టర్కు సైతం సమాచారం కూడా ఇవ్వలేదని.. చాలా కీలకమైన 22A సెక్షన్ లో జరిగిందని తెలియజేశారు.. ముఖ్యంగా అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా లేదని విద్యుత్ అధికారులు కూడా తెలియజేశారు.. పక్కనే సబ్స్టేషన్ కూడా ఉండడంతో పలు రకాల అనుమానాలు కూడా ఉన్నాయని తెలియజేశారు. అయితే ఈ విషయం తెలిసిన సీఐ కూడా కనీసం డిఎస్పి కి కూడా చెప్పలేదని రాత్రి 10:30 అక్కడ నిధులు నిర్వహించారు.. ఎందుకు వచ్చారో ఆయన చెప్పలేదని తెలిపారు బిజెపి.


అయితే ఈ సంఘటన సమయంలో ఒక కొత్త అగ్గిపెట్టి ను కూడా గుర్తించామని దీనిని ఫోరెన్సిక్ నిపుణులకు విచారణకు పంపించామని సాక్షాలు మాయం చేయడానికి ఇలా చేసే అవకాశం ఉన్నది.. అందుకే ఈ తరహాలోనే ఘటన పైన పలు రకాల కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. దాదాపుగా పది బృందాలతో ఈ ఘటన పైన విచారణ నియమించామని తెలిపారు డిజిపి.. ఒకవేళ అవసరమైతే ఈ కేసును సిఐడి కి బదులిస్తామంటూ కూడా తెలిపారు.. త్వరలోనే విచారణలో అన్ని బయటకి వస్తాయని డీజీపీ ద్వారక తిరుమల రావు తెలియజేశారు. ముఖ్యంగా భూముల రికార్డులు తగ్గమవడం పైన సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం అయ్యారని తెలిపారు. అందుకే ఈ ప్రమాదాన్ని మరింత లోతుగా విచారణ జరుగుతున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: