• నేడే ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్  

• ఇది వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో కీలకం  

• వికసిత్‌ భారత్ వెబ్‌సైట్ ఫీచర్లు ఏంటి

(ఇండియా - ఇండియా హెరాల్డ్)

నేడు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై భారతదేశంలో చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ బడ్జెట్ మరో కారణంగా కూడా ప్రజల్లో ఆశలను రేకెత్తిస్తోంది. అదే దీన్ని వికసిత్‌ భారత్ దిశగా రూపొందించడం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ 'వికసిత్‌ భారత్’ లక్ష్య సాధనలో 13వ కేంద్ర బడ్జెట్ కీలకం కానుందని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024, జులై 23న ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో సమర్పించబోతున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం పురోగతి సాధించేలా ఈ బడ్జెట్ రూపొందించినట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

పార్లమెంటు బడ్జెట్ సెషన్ ప్రారంభంలో తన ప్రసంగంలో, మోదీ పెరిగిపోతున్న భారతదేశ ఆర్థిక వృద్ధిని హైలైట్ చేశారు, మన దేశ ఆర్థిక వ్యవస్థ 8% స్థిరమైన వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నారు. ఈ బలమైన వృద్ధి దేశ అభివృద్ధి వ్యూహానికి వెన్నెముకగా నిలుస్తుందని చెప్పారు.

ఈ సందర్భంలో వికసిత్‌ భారత్ వెబ్‌సైట్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించింది, డెవలప్డ్ ఇండియా కోసం ప్రభుత్వ దార్శనికత, రోడ్‌మ్యాప్‌ను ఇది డిస్‌ప్లే చేస్తుంది. ఈ వెబ్‌సైట్ ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు, విధానాలను కూడా వివరిస్తుంది. ఇది వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత వంటి కీలక రంగాలపై డీటైల్డ్‌ ఇన్ఫర్మేషన్ సైతం అందిస్తుంది, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలనూ ప్రదర్శిస్తుంది.

అంతేకాకుండా, వికసిత్‌ భారత్ వెబ్‌సైట్ పౌరులు అభివృద్ధి ప్రక్రియలో పాలుపంచుకోవడానికి ఇంటరాక్టివ్ సాధనాలు, వనరులను కలిగి ఉంది. ఇది వివిధ ప్రాజెక్ట్‌ల పురోగతి, ప్రజల భాగస్వామ్యానికి అవకాశాలు, అభిప్రాయాలు, సూచనల కోసం ప్లాట్‌ఫామ్‌లపై అప్‌డేట్స్‌ ఆఫర్ చేస్తుంది.

సాధారణంగా ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే, అవి ఎలా రూపొందించబడుతున్నాయో, అమలు చేయబడుతున్నాయో ప్రజలకు తెలియజేయడం చాలా ముఖ్యం. దీనినే పారదర్శకత అంటారు. ఈ వెబ్‌సైట్ ఈ పారదర్శకతను మెయింటైన్ చేస్తుంది. అలాగే, ఈ లక్ష్యాలను సాధించే ప్రక్రియలో అందరూ భాగస్వామ్యం వహించేలా చేస్తుంది.కేంద్ర బడ్జెట్ 2024 ఆవిష్కరణ తర్వాత వికసిత్‌ భారత్ వెబ్‌సైట్ ప్రభుత్వ వ్యూహాలు, విజయాలను తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే దాని ప్రతిష్టాత్మక లక్ష్యం వైపు దేశాన్ని నడిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: