ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిన్నటి రోజు నుంచే ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి సైతం గవర్నర్ మాట్లాడడం జరిగింది. ఇక రెండవ రోజు శాసనసభలో కీలకమైన బిల్లులను సైతం ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే రెండో రోజు అసెంబ్లీ సమావేశాలలో పలు రకాల ప్రశ్నలు చేపట్టబోతున్నారు స్పీకర్.. ఆ తర్వాత కీలక బిల్లులను ప్రవేశపెట్టడం జరుగుతుందట. ముఖ్యంగా ఇందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ రద్దు బిల్లు.. అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.


అలాగే గవర్నర్ ప్రసంగం పైన కూడా ధన్యవాదాలు తీర్మానం పైన రెండో రోజు చర్చ కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ప్రశ్నోత్తరాల్లో భాగంగా 10 ప్రశ్నలకు సమాధానం మంత్రులు ఇవ్వబోతున్నారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల విషయానికి వస్తే.. పాఠశాలలో నిర్వహించినటువంటి నాడు నేడు, కొత్త పాలిటెక్నిక్, వాలంటరీ వ్యవస్థ, ఐటిఐలు, వి ఆర్ లో ఉన్న ఇన్స్పెక్టర్ల సమస్యలు, విశాఖ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, కేంద్ర పథకాలు, ఎస్టీ సబ్ ప్లాన్, విభజన హామీలతో పాటు 2022 గ్రూప్-1 పోస్టుల ఇంటర్వ్యూలు, తుంగభద్ర హెచ్ఎల్ కెనాల్ మోడరైజేషన్ పైన సమాధానాలు ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర మంత్రులు తెలిపారు.

రెండవ రోజు శాసనమండలి సమావేశాలలో గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తీర్మానాన్ని కూడా చర్చించబోతున్నారు అలాగే ఈ చర్చను ఎమ్మెల్సీ బీటి నాయుడు ప్రారంభించబోతున్నారు. ఎన్నికలలో హామీ భాగంగా ల్యాండ్ టైటిలింగ్ ఆటను కూడా రద్దు చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. వాటిని కూడా ఈ రోజే ప్రవేశపెట్టేలా చూస్తున్నారు. వీటితోపాటు వైద్య ఆరోగ్యం, టీటీడీలో అక్రమాలు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, ఎస్సీ ఎస్టీ బీసీల పెన్షన్ పథకం, పౌరసరఫరాల రుణాలు, గనుల్లో అక్రమాలు, గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఆరోగ్య వివరాలపైన సమాధానాలను కూడా ఇవ్వబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: