-బడ్జెట్ పైనే భారీ ఆశలు.
- అమరావతి, పోలవరం పూర్తయ్యే బడ్జెట్ వస్తుందా?
- నిర్మలమ్మ చేతిలో ఏపీ భవిష్యత్తు.!

 కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడవసారి కొలువు తీరింది. కానీ ఈసారి  వారు అనుకున్న ఫిగర్ లో మాత్రం  సీట్లు సాధించలేకపోయింది. దీంతో తెలుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు సహకారం కేంద్రంలో ఎంతో అవసరమైంది. ఇప్పుడు బిజెపి కేంద్ర సర్కార్ నిలబడడంలో  చంద్రబాబు నాయుడు కీలకంగా మారారని చెప్పవచ్చు.  అలాంటి ఈ తరుణంలో ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినటువంటి చంద్రబాబు ఈసారి బడ్జెట్ లో కేంద్రానికి ప్రత్యేక నిధులు తెచ్చుకోవాలని ఆలోచనతో ఉన్నారు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలు కూడా విపరీతంగా కొట్లాడే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎన్ని నిధులు వస్తాయి, ఏ శాఖలకు కేటాయిస్తారు. నిర్మలమ్మ బడ్జెట్ ఏపీ తలరాత మారుస్తుందా. అనే వివరాలు చూద్దాం.

 బడ్జెట్ పైనే బండెడాశలు:
 ఎన్డిఏ ను   ఆదరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ బడ్జెట్ వరాలిస్తుందా? మోడీ సర్కార్ లో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు ఎలాంటి మంత్రి పదవులు కానీ, ఇతర ఏ శాఖలో పదవులు కానీ అడగలేదు.  కేవలం ఏపీని అభివృద్ధి చేయడం కోసమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు.  అలాంటి ఈ తరుణంలో ఏపీకి నిధుల వరద పారించాలని కంకణం కట్టుకున్నారు.  అలాంటి కేంద్ర బడ్జెట్ ప్రవేశాల్లో ఏపీకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించడం కోసం  ఇప్పటికే రాష్ట్ర ఎంపీలందరికీ  టిడిపి బాస్ చంద్రబాబు నాయుడు దిషా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులలో  ఈ అంశాలే కీలకంగా మారనున్నాయి.


రాజధాని వ్యవహారం విశాఖ స్టీల్ ప్లాంట్, అమరావతి నిర్మాణం వంటి అంశాలపై ఏపీ ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విధంగా వివిధ శాఖల నుంచి భారీగా రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాలు, కేంద్రం కలిసికట్టుగా పనిచేస్తేనే దేశం మరింత పటిష్టమవుతుందని కేంద్ర పెద్దలు అంటున్నారు. ఇదే తరుణంలో ఏపీకి కూడా వాళ్లు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేసే దిశగా సహకారం అందించే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అనుకున్న నిధులు కేటాయిస్తారా? లేదంటే అందరిలాగే తూతూ మంత్రంగా  ఇస్తారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: