* కీలక సంస్కరణల దిశగా బడ్జెట్ రూపకల్పన

* ఆ రాష్ట్రాలకు బడ్జెట్ లో భారీగా నిధుల కేటాయింపు

* వెనుక బడిన రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపు ఎలా ఉంటుందో ..?




ఈ ఏడాది దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఎన్డిఏ కూటమి ఘన విజయం సాధించింది. కేంద్రంలో మోదీ సర్కార్ మూడో సారి కొలువుదీరింది.ఇదిలా ఉంటే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అయిన నిర్మల సీతారామన్ జులై 23 మంగళవారం పూర్తి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.నిర్మలా సీతారామన్ పేరిట వరుసగా ఏడు బడ్జెట్ లు సమర్పించిన రికార్డు నమోదు కానుంది. అయితే గతంతో పోలిస్తే బీజేపీకి లోక్ సభ స్థానాలు తగ్గడం అలాగే త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వుండనున్న నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ లో జనాకర్షక  నిర్ణయాలు వుండనున్నాయని సమాచారం.మిత్ర పక్షాల మద్దతుతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ సమర్పణ అనేది కత్తి మీద సాము లాంటిది.అందుకే అన్ని రాష్ట్రాలను అన్ని పార్టీలను సంతృప్తి పరిచేవిధంగా ఈ సారి బడ్జెట్ వుండనుందని సమాచారం.రోడ్లు ,రైల్వేలు,ఎయిర్ పోర్టులు ,ఓడరేవులు వంటి సెక్టార్లలో ఈ సారి బడ్జెట్ వెలుగులు విరజిమ్మనున్నాయి.అయితే గతంలో కంటే ఈ సారి ప్రత్యక్ష పన్ను వసూళ్లు 35 వేల కోట్లు పెరిగాయి.దీనితో ఈ ఏడాది కూడా పన్ను చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే మోదీ సర్కార్ ముందు ఎన్నో సవాళ్లు వున్నాయి..మోదీ హయాంలో ఇప్పటివరకు అభివృద్ధి ఫలాలు సంపన్నులకే ఎక్కువగా దక్కాయని వస్తున్నా ఆరోపణల నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ లో గ్రామీణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉండనున్నట్లు సమాచారం.అయితే మోదీ సర్కార్ వున్న గత ఐదేళ్ళలో  ఉద్యోగ అవకాశాలు మెరుగు పడలేదు.డిగ్రీ పట్టా పొంది ఉద్యోగాలు లేక ఖాళీగా వున్నా నిరుద్యోగులు అంతా కూడా ఈసారి బడ్జెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు.

ఈ సారి మోదీ సర్కార్ కు సీట్లు తక్కువ రావడంలో నిరుద్యోగ సమస్య కీలక పాత్ర పోషించడంతో ఈ సారి నిరుద్యోగులకు ఊరటనిచ్చే విధంగా బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తుంది.అలాగే ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్ భారత్ ను మూడేళ్ళలో రెట్టింపు చేసే దిశగా కేంద్రం పావులు కదుపుతుంది .ఇందులో మొదటి చర్యగా 70 ఏళ్లు పైబడినవారందరినీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలోకి తేవాలన్నది కేంద్రం ఆలోచన. ఆయుష్మాన్‌ భారత్‌ కింద కవరేజీ మొత్తాన్ని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీంతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 50 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది.ఈసారి కేంద్ర బడ్జెట్ పై అన్ని వెనుక బడిన రాష్ట్రాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.ఆ రాష్ట్రాలు ఆశించిన రీతిలోనే కేంద్ర బడ్జెట్ పలు కీలక సంస్కరణలకు పెద్ద పీట వేస్తుందా లేక ఎప్పటి లాగే మురిపించి మరిపిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: