ఈ నెల 23వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ తో పాటు కొత్తగా మరికొన్ని ప్రాజెక్ట్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ ఇప్పటికే కేంద్ర ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి ఈసారైనా ఆశించిన స్థాయిలో నిధులు దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఫీలవుతోంది.
 
కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ను కేటాయించనున్నారు. రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులను కేటాయించాల్సి ఉన్నా లెక్క ప్రకారం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రాష్ట్రానికి 3% వాటా రావాల్సి ఉండగా రాష్ట్రానికి 1.4% మాత్రమే వచ్చినట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. గతేడాది 41,529 కోట్ల రూపాయలు గ్రాంట్లుగా వస్తాయని తెలంగాణ సర్కార్ ఆశించినా కేవలం 9729 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి.
 
అయితే తెలంగాణ వాసులు తమ 19 ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో నెరవేరాలని కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ స్థాపన, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, ఆధునీకరణ, డబ్లింగ్ వంటి పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని వాళ్లు భావిస్తున్నారు.
 
హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కు చేయూత ఇవ్వాలని మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్ట్ కు ఆర్థిక సహాయం అందించాలని మూసీ రివర్ అర్బన్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు సాయం చేయాలని తెలంగాణ వాసులు ఫీలవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే పథకానికి కేంద్రం సపోర్ట్ కావాలని హైదరాబాద్ సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వాసులు ఫీలవుతున్నారు.
 
ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కు సమ్మతి తెలపాలని కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా ఎలకుర్తిలో సైనిక స్కూల్ స్థాపన జరగాలని హైదరాబాద్ లో ఐ.ఐ.ఎం ఏర్పాటు చేయాలని, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు 347 కోట్ల రూపాయలు రావాలని, హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై, నాగ్ పూర్ వెళ్లే జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
హైదరాబాద్ కల్వకుర్తి హైవేను నాలుగు లైన్లకు విస్తరించడానికి నిధులు కేటాయించాలని, తెలంగాణలోని ఎనిమిది రోడ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కాలని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకం కింద తెలంగాణకు నిధులు కేటాయించాలని, స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్ నగరాలకు నిధులు కేటాయించాలని, రాష్ట్ర నార్కొటిక్స్ బ్యూరీ ఆధునీకరణకు ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ సర్కార్ ఆశిస్తోంది. ఈ 19 ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: