•కేంద్ర బడ్జెట్ విద్యుత్ చార్జీలపై ప్రభావం..

•సూర్య ఘర్ యోజన పథకం మొదలు..

•టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం..


(కేంద్ర బడ్జెట్ - ఇండియా హెరాల్డ్)

దేశం మొత్తం ఈరోజు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశం పెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఐదు నెలల్లో ఏఏ రంగాలపై బడ్జెట్ ప్రభావం చూపుతుంది అనే అంశాలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే నేడు కేంద్ర బడ్జెట్ ఎన్నో రకాల అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా టెక్స్టైల్ రంగంపై,  విద్యుత్ చార్జీలపై ప్రభావం ఎలా ఉండనుంది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


ముందుగా విద్యుత్ చార్జీల విషయానికి వస్తే...గత కొన్ని సంవత్సరాలుగా అధిక విద్యుత్ చార్జీలు చెల్లిస్తూ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. సరైన సమయంలో విద్యుత్తు ఉండడం లేదు. పైగా వర్షాలు , గాలి అధికమైతే మాత్రం రెండు మూడు రోజులపాటు విద్యుత్తు ఉండడం లేదు. ఫలితంగా పిల్లలు ,యువత, పెద్దలు అందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరిగా ఉండకపోవడం, పైగా చార్జీలు ఎక్కువ కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే అయితే ఈసారి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రజలలోకి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని గనుక అందుబాటులోకి తీసుకొస్తే ఖచ్చితంగా విద్యుత్ చార్జీలు తగ్గే అవకాశం ఉంది.

సూర్య ఘర్ యోజన విషయానికొస్తే సౌర ఉత్పత్తి.. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్ ను  ఏర్పాటు చేసి ఇంటికి కావలసిన అంత విద్యుత్తును ఉత్పత్తి చేసి మిగిలినది.. విద్యుత్ కేంద్రాలకు పాస్ అయ్యేలా చేస్తారట. దీనివల్ల భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు రాకుండా ఉంటాయని ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇక విద్యుత్తు చార్జీలు ఇంతలా కట్టాల్సిన అవసరం ఉండదు.

ఇకపోతే టెక్స్టైల్ రంగంపై కూడా ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ఏ విధంగా ప్రభావం చూపనుంది అని అంశాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పైగా జిఎస్టి కూడా అధికంగా ఉంటుంది . అయినా సరే బట్టలు కొనుగోలు పై ప్రజలు వెనుకడుగు వేయడం లేదు. అయితే ఈసారి ఎలాగైనా సరే జీఎస్టీ ని తగ్గించాలని, బట్టల ధరలు తగ్గాలని కూడా ప్రజల ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ బడ్జెట్ లో నిర్మల సీతారామన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: