* టీడీపీ కారణంగా ఏపీకి ప్రత్యేకంగా నిధులు
* గతంలో ఏపీకి కేంద్రం మొండిచేయి
* ఏపీకి ₹35,492 కోట్లు ఇచ్చిన కేంద్రం
* రాజధాని,పోలవరంకు భారీ నిధులు


నేడు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆర్ధిక శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ కు బయల్దేరి వెళ్ళనున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్....ఆతర్వాత, ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. ఇక ఈ రోజు ఉదయం 10.15 గంటలకు కేంద్ర మంత్రివర్గ  సమావేశం ఉంటుంది. బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం, ప్రధాని నరేంద్ర మోడితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత, ఈ రోజు ఉదయం 11 గంటలకు లోకసభలో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.

అయితే.. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టనున్న బడ్జెట్‌ పై ఏపీ ప్రజల్లో నూతన ఆసక్తి నెలకొంది.గత బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాగే విశాఖ పోర్టుకు నిధులు పూర్తిగా తగ్గించారు. ఏపీలో ఉన్న ఏ శాఖకు కూడా అరకొరా.. నిధులు ఇచ్చి చేతులు దులుపు పొంది కేంద్రం. గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు... 2023 మరియు 2024 సంవత్సరం గాను...  683 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ బడ్జెట్ను పెంచాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు.

 విశాఖపట్నం ట్రస్ట్ కు కూడా 2023-2024 బడ్జెట్లో 276 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ బడ్జెట్ ని కూడా మరింత పెంచాల్సి ఉంటుంది. ఇటు వైజాగ్ పెట్రోలియం యూనివర్సిటీకి 168 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఆ నిధులను కూడా అప్పగించాలి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో... టిడిపి ఉన్న నేపథ్యంలో... ఏపీకి భారీగా నిధులు వస్తాయని అందరూ అనుకుంటున్నారు.

 కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడుకు వచ్చిన నేపథ్యంలో... ఈసారి.. పోలవరం, రాజధాని కోసం ప్రత్యేక నిధులు వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఏపీ రోడ్ల పైన.. కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని సమాచారం. అంతేకాకుండా..... ఏపీలో ఫ్యాక్టరీలు, కంపెనీలు విపరీతంగా పెట్టేలా... రాయితీలు కూడా కేంద్రం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైల్వే శాఖకు... భారీగానే నిధులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: