- నిర్మలమ్మ పద్దులపై భారీ ఆశలు
- రైతన్నలకు మేలు చేసే బడ్జెట్ ఉంటుందా?


మోడీ సర్కార్ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. గత రెండు పర్యాయాలు అద్భుతమైన మెజారిటీతో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి నచ్చినట్టు బడ్జెట్ రూపకల్పన చేసుకుంది. కానీ ఈసారి బడ్జెట్ రూపకల్పనలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బిజెపి దేశంలో, కాస్త చతికిల పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇతర పార్టీలపై ఆధారపడవలసి వచ్చింది. ఇందులో ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు మరియు నితీష్ కుమార్ లతో జతకట్టి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో మంగళవారం బడ్జెట్ సమావేశాలు ఉన్న సందర్భంగా అన్ని రాష్ట్రాలకు సమానమైనా బడ్జెట్ ఇవ్వడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అద్భుతమైనటువంటి నిధులు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని ప్రధాని మోడీ ముందు ఇప్పటికే డిమాండ్ పెట్టేసారు. ఈ విధంగా కేంద్రంలో సరైన మెజారిటీ లేని బీజేపీ ప్రభుత్వం నితీష్ కుమార్ పై మరియు చంద్రబాబులపై ఆధారపడవలసి వచ్చింది కాబట్టి వారు అడిగింది తప్పనిసరిగా ఇచ్చే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంత కేటాయిస్తారు? రైతన్నలకు, ఏ విధమైన మేలు చేస్తారు అనేది చూద్దాం.

 రైతును రాజు చేస్తారా?
 గత రెండు పర్యాయాలలో మంచి మెజారిటీతో వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం  రైతులను చాలా దారుణంగా ఇబ్బందులకు గురిచేసింది.  దేశంలోని చాలా రాష్ట్రాల్లో రైతులు అప్పుల పాలయ్యారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర దొరకకపోగా, దీనికి తోడు పెరిగిన ఎరువుల విత్తనాల ధరలు, జిఎస్టి ఇలా అనేకం కేంద్రం ప్రవేశపెట్టి రైతులపై భారాన్ని మోపింది. రైతుల పెట్టుబడి ఎక్కువైంది, రాబడి తక్కువ అయిపోవడంతో రైతులు తీవ్రంగా చతికిలపడ్డారు. గత ఎన్నికల ముందు   రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయించి ధరలు తగ్గిస్తామని చెప్పిన బిజెపి సర్కార్ రెండుసార్లు మోసం చేసింది. దీంతో మూడవసారి రైతులు  కాస్త బీజేపీపై మొహం విరిశారు. దీన్ని అర్థం చేసుకున్న బీజేపీ ఈ బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేయాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పండించిన పంటలకు మద్దతు ధర, ఎరువులు విత్తనాలపై  ధరలు తగ్గించడం రైతులకు అందుబాటులో ఎన్నో సబ్సిడీలు తీసుకురావడం వంటి వాటికీ బడ్జెట్ కేటాయించే అవకాశం కనిపిస్తున్నది. ఈ విధంగా దేశవ్యాప్తంగా రైతులే ప్రధాన లక్ష్యంగా చేసుకొని బిజెపి బడ్జెట్ కేటాయింపులు చేస్తే మాత్రం రాబోవు రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది.  లేదంటే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పూర్తిస్థాయిలో అధికారం కోల్పోతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రైతులకు బిజెపి సర్కార్ ఎలాంటి మేలు చేస్తుంది. ఏపీ ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: