ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా టిడిపి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వరుసగా దాడులు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఏపీలో ఎప్పుడైతే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి చాలామంది తెలుగు తమ్ముళ్లు  మా టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అలజడులు సృష్టిస్తూ దాడులు కూడా చేస్తున్నారు. దీనికి ప్రధాన ఉదాహరణ వినుకొండ ఘటన.. వినుకొండ పట్టణంలో రాత్రి 8 గంటల సమయంలో రషీద్ పై  జిలానీ అనే వ్యక్తి మారణాయుధంతో దాడి చేసి దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.  

రాజకీయ నాయకులు కూడా దారుణంగా విమర్శలు చేసుకున్నారు.  ఈ విధంగా ఈ ఘటన నడుస్తున్న తరుణంలోనే మరో ఘటన చోటు చేసుకుని సంచలనంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని  పర్సనల్ అసిస్టెంట్ పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన దారుణంగా గాయపడ్డారు.  స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పిఎ ఆచంట లక్ష్మోజీపై  సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేసి వెళ్లిపోయారు.  ఆయన మచిలీపట్నంలోని పౌరసరాఫరాల శాఖలో పనులు పూర్తి చేసుకుని వెళ్తున్న క్రమంలో లక్ష్మోజిపై స్థానిక పోలీస్ స్టేషన్ రోడ్డులో ఉన్నటువంటి  సిఎస్ఐ చర్చి దగ్గర దాడి చేశారు.

 ఈ దాడిలో మొత్తం ఎనిమిది మంది దుండగులు పాల్గొన్నట్టు తెలుస్తోంది.  వెంటనే స్పందించినటు వంటి స్థానికులు ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైసీపీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకొని భారీగా నినాదాలు చేశారు. ఇదంతా టిడిపి పనే అంటూ  కొంతమంది అంటున్నారు. ఇక లక్ష్మోజీ తలకు తీవ్రంగా గాయాలు అవ్వడంతో  ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని విజయవాడ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈ ఘటన ఇంకెక్కడికి దారితీస్తుంది.. ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరు అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: