నేడు కేంద్ర బడ్జెట్ పెట్టనుంది మోడీ సర్కార్‌. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. నేడు కేంద్ర బడ్జెట్ పెట్టనుంది మోడీ సర్కార్‌. ఈ తరుణంలోనే భారత దేశ చరిత్రలో నేడు రికార్డ్ సృష్టించనున్నారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. ఏడు సార్లు వరుసగా కేంద్ర బడ్జెట్ లను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్ ను సృష్టిస్తున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. 2019 లో తొలిసారిగా, కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి, ఎలాంటి గ్యాప్ లేకుండా, వరుసగా ఈరోజు 7 వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెడుతూ, రికార్డ్ సృష్టించారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.


గతంలో, కేంద్ర ఆర్ధిక మంత్రిగా వరుసగా 6 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మురార్జీ దేశాయ్. అలాగే 1959 నుంచి 1963 వరకు కేంద్ర ఆర్ధిక మంత్రిగా 6 ఏళ్ళు వరుసగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు మురార్జీ దేశాయ్. అయితే, 1959 నుంచి వరుసగా 5 సార్లు పూర్తి స్థాయు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టగా, ఒక్కసారి మాత్రం తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మురార్జీ దేశాయ్...కానీ, నాలుగేళ్ళ తర్వాత మరలా 1967 నుంచి మరో 4 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.


అయితే, మొత్తం 10 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టి మురార్జీ దేశాయ్ సృష్టించిన రికార్డ్ ను మాత్రం ఇంతవరకూ ఎవరూ అధిగమించలేదని చెబుతున్నారు నిపుణులు. మొరార్జీ దేశాయ్ తర్వాత, మొత్తం 9 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టి రెండవ స్థానంలో ఉన్న పి. చిదంబరం ఉన్నారు. 1997 లో దేవగౌడ ప్రధానిగా, “యునైటెడ్ ఫ్రంట్” అధికారంలో ఉన్నప్పుడు, తొలిసారిగా, ఆర్ధిక మంత్రిగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు పి.చిదంబరం. ఆ తర్వాత, 2004 నుంచి 2014 వరకు, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ-1, యుపిఏ-2 ప్రభుత్వాలలో, హోమ్ మంత్రి గా పనిచేసిన మూడేళ్ళు మినహాయించి, మిగిలిన సంవత్సరాల్లో ఆర్ధిక మంత్రిగా కేంద్ర బడ్జెట్ లను ప్రవేశ పెట్టారు.


ఆ తర్వాత మూడవ స్థానం, మొత్తం 8 సార్లు బడ్జెట్ లను ప్రవేశపెట్టారు ప్రణబ్ ముఖర్జీ. తొలిసారి 1982 లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రణబ్ ముఖర్జీ....2012 లో, చివరిసారిగా, కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గతంలో ఏవిధంగా అయుతే, పూర్తి స్థాయు “పేపర్ లెస్” బడ్జెట్ లను ప్రవేశ పెట్టారో, ఈసారి కూడా అదే విధంగా “పేపర్ లెస్” బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల. సార్వత్రిక ఎన్నికలున్నందున, ఈ ఏడాది ఫిబ్రవరి 1 వ తేదీన తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.


మరింత సమాచారం తెలుసుకోండి: