ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. వైసిపి నేత రషీద్ హత్య కేసు సంఘటన గురించి రాజకీయాలు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వినుకొండలో వైసిపి నేత.. రషీద్ ను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి హత్య చేశాడని... వైసిపి పార్టీ ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు కనుసనల్లోనే.. వైసిపి నేతల పై దాడులు జరుగుతున్నాయని... కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే 36 హత్యలు జరిగాయని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.


అంతే కాకుండా... రషీద్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. అటు రషీద్ కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో రషీద్ కేసును... తీసుకుపోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీకి పయనం అయ్యార జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసిపి ఎంపీలు , ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా వెళ్తున్నారు.


పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో... ఢిల్లీలో ధర్నాలు చేస్తే చంద్రబాబుకు  ఆయన ప్రభుత్వానికి జలక్ ఇవ్వవచ్చని... జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు కూడా... జగన్ డుమ్మా కొట్టే అవకాశాలు ఉంటాయి. అయితే...  ఢిల్లీలో చేయబోతున్న ధర్నా నేపథ్యంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

అన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అందులో వస్తుంది. ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి... వ్యతిరేకంగా పనిచేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా... జగన్కు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ దిశగానే.. రాహుల్ గాంధీని కూడా జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారట. కాంగ్రెస్ ఎంపీలను తమ ధర్నాలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరబోతున్నారని సమాచారం అందుతోంది. దీనికి రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు జాతీయ నాయకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: