ఏపీలో నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏం జరగబోతుంది అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేకపోయింది.


 కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదాను కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారా? ఒకవేళ జగన్ అసెంబ్లీకి వస్తే 164 స్థానాల భారీ మెజారిటీతో ఉన్న కూటమి సభ్యులు ఎలా వ్యవహరిస్తారు? గతంలో జగన్ చేసిన వాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటారా? అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో జగన్ రఘురామకృష్ణ రాజును తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇక ఇప్పుడు కూటమిలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రఘురామా.. జగన్ ను టార్గెట్ చేస్తూ ఎలాంటి విమర్శలు చేస్తారు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.



 అయితే నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ముచ్చటించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ఇద్దరు ఇలా ఒకరిని ఒకరు పలకరించుకోవడమే అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయంపై రఘురామ క్లారిటీ ఇచ్చారు. తామేం మాట్లాడుకున్నాము అన్న విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష నేత హోదా లేదన్న విషయంపై ఆలోచించొద్దు అంటూ జగన్ కి చెప్పాను అంటూ రఘురామ చెప్పుకుచ్చారు. మీకు ప్రతిపక్ష హోదాతో సంబంధం ఏముంది.. వైసిపి నాయకుడిగా సమావేశలకు రండి అని పిలిచాను. తప్పకుండా వస్తాను అని జగన్ చెప్పారు అంటూ రఘురామ చెప్పుకొచ్చారూ.

మరింత సమాచారం తెలుసుకోండి: