నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు సైతం మొదలయ్యాయి. ఈ సందర్భంగా అక్కడ పలు రకాల ఆసక్తి పరిణామాలు కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే జగన్ నల్ల కండువాళ్ళతో నిరసనలు తెలియజేస్తూ పోలీసులను కూడా హెచ్చరించడం జరిగింది. శాసనసభ పక్ష సమావేశంలో జగన్ పైన పవన్ సెటైర్లు వేయడం చంద్రబాబు నిప్పులు కురిపించడం వంటివి కూడా జరగడం జరిగింది. ఈ సమయంలోనే జగన్ దగ్గరికి వెళ్లి ఉండి ఎమ్మెల్యే రఘురామ మాట్లాడడం ఒకసారిగా రాజకీయాలలో హార్ట్ టాపిక్ గా మారింది.


నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి జగన్ తో రఘురాము మాట్లాడిన తీరు అత్యంత ఆసక్తికరంగా మారింది.. ఈ సందర్భంగా జగన్ తో రఘురామ ఏమి మాట్లాడారు అసలు ఎందుకు మాట్లాడారు అనే విషయం పైన తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలోనే జగన్ తో తాను ఏమి మాట్లాడారనే విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని కారణంగా సభకు రాకూడదని ఆలోచన సరికాదని జగన్కు రఘురామకృష్ణ సూచించినట్లుగా తెలియజేశారు.


అసలు ఆ హోదాతో పనేముంది శాసనసభ పక్షానికి ప్రతిపక్ష నాయకుడు మీరే కచ్చితంగా ఆ హోదాలోని రండి అంటూ ఆయన తెలియజేశారట. ముఖ్యంగా నిన్నటి రోజున అసెంబ్లీలోకి ప్రవేశించిన జగన్ ఆ తర్వాత సభ్యులందరికీ నమస్కారం చేసుకుంటూ వెళుతున్న సమయంలో రఘురామకృష్ణంరాజు తన సీటు నుంచి లేచి వచ్చి వైసిపి అధినేత జగన్ ను పలకరించారు. అంతేకాకుండా జగన్ సీటులోకి వెళ్లి కూర్చున్న తర్వాత ఆయన వద్దకు వెళ్లి మాట్లాడడం జరిగింది. rrr మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చేసిన వారు మీరు మీ పార్టీ శాసనసభ పక్షానికి నాయకుడు కూడా మీరే కాబట్టి ఆ హోదాలోనే రండి అంటూ జగన్కు సూచించారట. ఈ విషయాలన్నీ రఘురామ చెప్పినప్పటికీ జగన్ కూడా తప్పకుండా వస్తానని సమాధానం తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి: