కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ఈ రోజున ప్రవేశపెట్టబోతోంది .ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఏ ఏ వారికి బాగా కలిసొస్తుందని విషయం పైన చాలా మంది ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం పనితీరుపైన గత ఏడాది కంటే ఏడాది మెరుగుపడుతోందని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ రాజీవ్ బజాజ్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ రంగం పైన విధించే పన్ను ను సైతం వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజున సీతారామన్ బడ్జెట్ని సైతం ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ పైన ఆటోమొబైల్ రంగానికి చెందిన ఎన్నో అంచనాల పైన కూడా ఆశలు ఉన్నాయి. అలాగే ఆటో పరిశ్రమ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి డిమాండ్ల విషయానికి వస్తే..



ప్రభుత్వం మౌలిక సదుపాయాల పైన వ్యయాన్ని పెంచుతోందంటూ ఆటోమొబైల్ ఇది భారంగా భావిస్తోంది. అంతేకాకుండా ఫేమ్ -3 ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ పాలసీ ప్రకటన కూడా ఉంటుందంటు ఆశాజనకంగా ఎదురుచూస్తున్నారు. అలాగే జిడిపి ఆర్థిక వ్యవస్థను కూడా పెంచడానికి ఆర్థిక మంత్రి ప్రకటనలు చేస్తారని ఆటోమొబైల్ రంగాల సంఘం వారు నమ్ముతున్నారు. ఆటో పరిశ్రమ పురోగతి ఆర్థిక వ్యవస్థను సైతం పురోగతి చేయడానికి ఈసారి బడ్జెట్ ఉంటుందని నమ్ముతున్నారు. దీంతో పాటుగా పాత వాహనాల రద్దు చేసే విధానాన్ని అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా నిర్ణయాలు తీసుకుంటారని ఆశగా ఉందట.


అలాగే ఆటోమేటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వారు జీఎస్టీ మినహాయింపు తో సహా యంత్రాలపైన అందుబాటులో ఉంచడానికి చూడాలంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. Fada ఆదాయ పన్ను రిటర్న్ చేసేవారికి వాహనాలు కొనుగోలు పైన కూడా మినహాయింపు ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేయబోతున్నారట దీనివల్ల పరిశ్రమలకు కూడా మేలు జరుగుతాయని.. వీటి వల్ల తిరిగి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని..FADA కూడా కార్పొరేట్ పనులలో మినహాయింపు కోరుకుంటుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ వాహనాల పైన రాయితీని కూడా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: