2024 బడ్జెట్లో ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజున బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది.. లోక్సభలో 11:04 గంటలకు ఈ బడ్జెట్ ని సైతం ప్రారంభించారు.. అలాగే ఇవాళ యూనియన్ బడ్జెట్ లో కూడా ఎలాంటి కీలకమైన ప్రకటన చేయబోతున్నారని అందరూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా యువత, రైతులకు మహిళలకు కొత్తగా ఏం చెబుతున్నారనే విషయం పైన చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఈసారి బడ్జెట్లో వరాల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది.


ఏపీకి ప్రత్యేక సహాయం..


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే విభజనచట్టంలో తెలియజేసినటువంటీ అన్ని అంశాలను అమలు చేస్తామని తెలియజేశారు.. అలాగే
ప్రత్యేక ఆర్థిక సహకారం అందిచనున్నట్లు తెలిపారు.2024-25 బడ్జెట్‌లో ఏపీ అభివృద్ధికి రూ.15వేల కోట్ల రూపాయిల నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో ఒక్క సారిగా నేతలు సైతం ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అలాగే వీటితో పాటుగా.. ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేశారు.




పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామని అలాగే..విశాఖ,చెన్నై వంటి ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు అందిస్తామని కూడా తెలియజేశారు..విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయంగా
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు నిధులు అందిస్తామంటూ తెలియజేశారు నిర్మల సీతారామన్. వచ్చే ఐదేళ్లలో దాదాపుగా 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి చేస్తామని వారికి రుణ సదుపాయం కూడా కల్పిస్తామని తెలిపారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు కూడా రుణం సహాయాన్ని పెంచామని తెలిపారు. బీహార్, జార్ఖండ్ తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామంటూ తెలియజేయడం జరిగింది నిర్మల సీతారామన్.

మరింత సమాచారం తెలుసుకోండి: