లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. వికసిత్‌ భారత్‌ లక్ష్యమని గట్టిగా గర్జిస్తున్న మోడీ సర్కార్‌.. ఇవాళ్టి యూనియన్‌ బడ్జెట్‌లో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించబోతోంది అని యావత్ దేశం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మోదీ ప్రభుత్వం ముచ్చటగా 3వ సారి కొలువు తీరిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న విషయం అందరికీ తెలిసినదే. ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్రం.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి బడ్జెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశం మెండుగా కనిపిస్తోంది. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే... కొన్ని సెక్టార్‌లకు భారీ కేటాయింపులు ఉండొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఈ క్రమంలోనే యువత ఎంతగానో ఎదురు చూసిన క్షణానికి తెరపడింది. విషయం ఏమిటంటే... ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలను మోదీ సర్కార్ వరాల జల్లు కురిపించింది. ఈ.పి.ఎఫ్.వోలో నమోదు ఆధారంగా వీటి అమలు జరగనుంది. సంబంధిత రంగంలో మొదటిసారి జాయిన్ అయిన ఉద్యోగులకు ఒక నెల వేతనం 3 వాయిదాల్లో గరిష్టంగా 15 వేల రూపాయల వరకు చెల్లించాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంటే గరిష్టంగా లక్ష రూపాయల లోపు మాత్రమే వేతనం ఉన్నవాళ్లు ఈ బెనిఫిట్ పొందడానికి పూర్తిగా అర్హులు అని అర్ధం చేసుకోవాలి. దీని ద్వారా దాదాపు 2 కోట్ల 10 లక్షల మందికి ఈ ప్రోత్సాహకాల ద్వారా మేలు జరగనుంది.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రా ప్రజలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు పేర్కొంటూ... రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం, 2024-25 బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల రూపాయిల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం కావద్దు, పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు కావచ్చు.. విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కావచ్చు.. ఇలా అనేక రకాలుగా ఆంధ్రాకి సాయం చేయబోతున్నట్టు చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు...  రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కూడా మంత్రి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: