ఈ సారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి వరాలు కురిసాయి. కాసేపటి క్రితమే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్...ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తున్న పూర్వోదయ పథకం ఆంధ్రాకు కూడా వర్తిస్తుందని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా.... రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం అందించబోతున్నట్లు కూడా ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌.


అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఉంటాయని కూడా చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం ఉంటుందని వెల్లడించారు. పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం అన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌.


భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం ఉంటుందని వెల్లడించడం జరిగింది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌.  హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.  కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు ఉంటాయన్నారు.


విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఉంటాయని కూడా వివరించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఉంటాయన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: