రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక కొన్ని సంవత్సరాల క్రితం వరకు రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యం వచ్చిన వారు దానిని ఎంతో కొంత డబ్బు ఇచ్చి తీసుకోవాల్సి వచ్చేది. ఇక ఆ డబ్బు కూడా పెట్టలేని స్తోమత లేని వారు కొన్ని కష్టాలను ఎదుర్కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చాక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలి అనే పథకాన్ని తీసుకువచ్చారు. అందులో భాగంగా చాలా సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే ఈ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో మరోసారి మోడీ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధి దారులకు అద్భుతమైన వరాల జల్లులు కురిపించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ను మరో ఐదేళ్ల పాటు పొడిగించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. దేశంలోని 80 కోట్ల మంది కి మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ అందించనున్నట్లు ఈమె తాజాగా వెల్లడించింది. ఇక ఈ పథకం ద్వారా 80 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.

దానితో ఈ పథకం ద్వారా బీ జే పీ ప్రభుత్వానికి , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి అద్భుతమైన క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ అందబోతుంది. ఇది రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు అద్భుతమైన పథకం అని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం వారు రేషన్ షాప్ ల నుండి పొందుతున్న వసతులను మరో ఐదేళ్ల పాటు అలాగే పొందవచ్చు. ఇలా ఈ గొప్ప పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించనున్నట్లు ప్రకటించడంతో దేశ పేద ప్రజలకు బీ జే పీ ప్రభుత్వం ఆనందాన్ని పంచినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: