నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తొలి బడ్జెట్ సమావేశాలను ప్రవేశపెట్టారు.. ఈ రోజున ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కేంద్ర బడ్జెట్ ని సైతం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కోసం సర్వత్ర అందరూ ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నారు. తమను మూడవసారి అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలకు ఎలాంటి వరాలు కురిపిస్తారనే విషయం పైన ప్రజలు ఉత్కత్తంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి బడ్జెట్లో ఎక్కువగా మౌలిక సదుపాయాలు వ్యవసాయం పైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.


ముఖ్యంగా కిసాన్ సన్మాన్ నిధి, పిఎం కిసాన్ యోజన కు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే విధంగా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు సైతం రుణాల పరిమితిని మోడీ సర్కార్ భారీగానే పెంచేసింది.. ముఖ్యంగా ముద్ర రుణాలను రూ .10 లక్షల నుంచిరూ .20 లక్షల రూపాయలకు పెంచినట్లు తెలియజేశారు.. అలాగే బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధి కోసం ఏకంగా రూ .2.66 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. దీనివల్ల రుణ సదుపాయాన్ని సైతం స్వయం ఉపాధి చేయాలనుకునే వారికి ఈ రుణ సహాయాన్ని అందిస్తారు.



వ్యవసాయ అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు.. విద్య నైపుణ్య అభివృద్ధికి 1,48 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో 9 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.. వ్యవసాయ రంగానికి కూడా డిజిటల్ టెక్నాలజీ కూడా అనుసంధానం చేయబోతున్నామని తెలిపారు. విద్య నైపుణ్య అభివృద్ధి కోసం లక్ష 48 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని నిర్మల సీతారామన్ తెలిపారు. 2,47 కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని  తగ్గినట్లుగానే బడ్జెట్ని రూపకల్పన చేశామంటూ నిర్మల సీతారామన్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: