ఈ రోజు లోక్ సభ సమావేశా ల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతా రామన్ ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక ఇందు లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ శాతం రైతుల కు , యువత కు , అభివృద్ధి మరియు టెక్నాలజీ కి ప్రాధాన్యతను ఎక్కువగా కల్పించినట్లు అర్థం అవుతుంది . అందులో భాగంగా ఈ బడ్జెట్ లో 500 పెద్ద కంపెనీల లో కోటి మంది కి ఉద్యోగాలు కల్పించనున్నట్లు నిర్మల సీతారామన్ తాజా బడ్జెట్ సమావేశంలో భాగంగా చెప్పింది. 

అలాగే 500 పెద్ద కంపెనీలలో కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు తోడ్పడడం మాత్రమే కాకుండా , దేశ అభివృద్ధికి కూడా తోడ్పడబోతున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించింది. ఇక 100 ప్రధాన నగరాలలో ఫ్లాగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులను నిర్మించనున్నట్లు కూడా నిర్మల సీతారామన్ తాజా బడ్జెట్ సమావేశంలో భాగంగా తెలియజేసింది. ఇక 100 ప్రధాన నగరాలలో అంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పవచ్చు.

దానిని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్లు అయితే కేంద్ర ప్రభుత్వానికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. వీటితో పాటు 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల సీతారామన్ తాజా బడ్జెట్ సమావేశంలో పేర్కొంది. ఇలా తాజాగా నిర్మల సీతారామన్ బడ్జెట్ ఎక్కువ శాతం యువతకు జీవనోపాధిని కల్పించి వారి మెరుగైన జీవితానికి తోడ్పడడం మరియు దేశాన్ని ప్రగతి వైపు ముందుకు నడిపించే విధంగా ఉంది. ఇక తాజా బడ్జెట్ సమావేశాలలో ప్రస్తుతం ఉన్న నగరాలను మరింత తీర్చిదిద్ది వాటిని ఉన్నత స్థాయి నగరాలుగా చేసేందుకు తోడ్పడే విధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: