కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. బీహార్‌ లో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే.. బీహార్‌ రాష్ట్రానికి రూ.26,000కోట్లు ప్రకటించారు  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. పూర్వోదయ పథకంలో ఏపీతో పాటు బీహార్‌ ను కూడా చేర్చుతున్నట్లు వెల్లడించారు. రాజ్‌గిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నట్లు కూడా వెల్లడించారు.. నలంద యూనివర్సిటీని టూరిస్ట్‌ సెంటర్‌గా అభివృద్ధి చేస్తామన్నారు నిర్మలా సీతారామన్‌.


భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ- ఆధార్ తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది.  కొత్త పన్ను విధానంలో మార్పులు చేసినట్లు కూడా ఆమె వెల్లడించారు. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా ఉంటుందని తెలిపారు. రూ.3-7 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్ ఉంటుందన్నారు. రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను.. రూ.10-12 లక్షల వరకు 15 శాతం ట్యాక్స్ తెలిపారు.


రూ.12- 15 లక్షల వరకు 20 శాతం శాతం పన్ను.. రూ.15 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు... కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా అవుతుందని కూడా తెలిపారు. అటు * బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గించారు.  ప్లాటినంపై సుంకం 6.4 శాతానికి కుదించారు.

500 పెద్ద కంపెనీలలో కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 100 ప్రధాన నగరాలలో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు  నిర్మిస్తామని కూడా తెలిపారు. 12 విసృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేస్తామని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: