ఈరోజు పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి వరాల జల్లు కురిపించారు. అవును, రాష్ట్రానికి కేంద్రం ఈసారి భారీ సాయం ప్రకటించింది. ఈ క్రమంలో అమరావతి రాజధానితో పాటు పోలవరం, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకటించడం జరిగింది. ఏపీకి వెనుకబడిన జార్ఖండ్ తో సమానంగా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో చాలా కాలం తర్వాత కేంద్ర బడ్జెట్ లో ఏపీకి చాలా స్పష్టంగా ప్రాధ్యాన్యత ఇవ్వబడింది అనడంలో అతిశయోక్తి లేదు.
 
మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం ఇక్కడ తీసుకోబడింది. విషయం ఏమిటంటే... పోలవరం ప్రాజెక్ట్‌ మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలపడం విశేషం. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఈ ప్రతిపాదనకు కార్యరూపం దాల్చినట్టు అయింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ శుభ పరిణామంతో పోలవరం పనులు ఇకపై శరవేగంగా పూర్తికాబడతాయి.

రాష్ట్రంలో నాల్గవసారి కొలువుదీరిన టీడీపీ సర్కార్‌కు ఇది తియ్యటి కబురని చెప్పుకోవచ్చు. ఈ ప్రకటన తర్వాత.. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు త్వరితగతిన మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ సహకారం ఎనలేనిది. కూటమి పొత్తుని ఆయన విస్మరించలేదు... ఆంధ్రాకి వరాలు జల్లు కురిపించారు.. పోలవరం సవాళ్ళను ఇకపై విజయవంతంగా అధిగమిస్తూ ముందుకు వెళ్తాము. గత ప్రభుత్వం వలె మేము చేయబోము.. అయితే కేంద్రం పోలవరానికి రావాల్సిన రూ. 12,157 వేల కోట్లు త్వరగా రిలీజ్ చేస్తే పనులు పూర్తి చేస్తాము." అని కోరారు. ఈ నేపథ్యంలో అందులో దాదాపు 8 వేల కోట్ల రూపాయిలు పునరావసానికి ఖర్చు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇక ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో భాగంగా పోలవరానికి పెద్ద పీట వేస్తున్నట్టు, త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap