2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధాన మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మూడవసారి అధికారంలోకి వచ్చింది. ఇలా వచ్చిన బడ్జెట్ పైన ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించేలా ఉన్నది.. మధ్యతరహ పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉంటుంది.. 2014 నుంచి మోడీ సర్కార్ ఇది 13వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏడవసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఈమె బడ్జెట్ పైన కాకుండా ధరించే చీరల పైన కూడా సాంప్రదాయ పద్ధతితోనే కనిపిస్తూ ఉంటుంది.


బడ్జెట్ లో భూములకు ఆస్తులకు సంబంధించిన వాటిలో ఈసారి ప్రజలకి కాస్త కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది..స్టాంప్ డ్యూటీ పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాలకు సైతం  అనుమతి ఇచ్చింది మోడీ సర్కార్.. అలాగే మహిళలకు సంబంధించి ఆస్తుల రిజిస్ట్రేషన్ పైన మాత్రం స్టాంపు డ్యూటీని తగ్గించినట్లు తెలుస్తోంది.. ఈ విషయం కాస్త మహిళలకు ఆనందదాయకంగా ఉన్నప్పటికీ.. ప్రజలకు సంతృప్తి ఇవ్వలేదు. అలాగే టాక్స్ పేయర్లు, మహిళలు యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రతి ఏటా 80 లక్షల కొత్త ఉద్యోగాలను కూడా కల్పిస్తామంటూ తెలిపారు.


వీటితో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాల పైన కూడా సబ్సిడీ అందించే విధంగా ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు 2023 నాటికి దేశంలో అమ్ముడుపోయే వాహనాలలో 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలి అంటు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామంటూ తెలిపారు. అలాగే ఈ ఎలక్ట్రిక్ వాహనాల పైన డిస్కౌంట్లు కల్పిస్తామంటూ తెలిపారు. యువతకు ఉపాధి నైపుణ్యాల ఇతర అవకాశాలను సులభంగా వచ్చేందుకు ఐదు కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. ఇందుకోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు. సుమారుగా 400 జిల్లాల ఇందుకు సంబంధించిన పనులు జరగబోతున్నాయని తెలిపారు. అలాగే మహిళల నైపుణ్య అభివృద్ధికి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడతామని తెలుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: