మూడవసారి మోది ప్రధానీగా మోది బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామ గడిచిన కొన్ని గంటల క్రితం ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.. ఇందులో కొన్ని వాటివల్ల ప్రజలకు కాస్త ఊరటన ఇచ్చినప్పటికీ మరికొన్ని అధిక భారం పడేలా చేస్తున్నాయి.. అలాంటి వాటిలో భారీగా పన్ను శాతం పెరిగినట్లుగా తెలుస్తోంది.. అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం..



కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేసినట్టు ప్రకటించిన నిర్మలమ్మ రూ.3 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవాళ్లకు సున్నా పన్ను అన్నట్టుగా తెలిపారు.. రూ .3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లకు 5 శాతం పన్ను ఉంటుందట. రూ .7 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవాళ్లకు 10 శాతం పన్ను ఉంటుందట. రూ.10 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవాళ్లకు 15 శాతం పన్ను ఉంటుందట.12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20 శాతం పన్ను ఉంటుందట. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను ఉంటుందట.


కేవలం 3 లక్షల లోపు ఉంటే పన్ను సున్నా అన్నట్లుగా తెలుస్తోంది. కొత్త విధానంలో మార్పుల వలన 17,500 పన్ను ఆధార్ అయితుంది.. అలాగే స్టాండర్డ్ డిడిక్షన్ రూ.50 వెలు నుంచి 75 వేల వరకు పెంచారు.. వీటితో పాటుగా నూతన పింఛన్ విధానంలో కూడా త్వరలోనే మార్పులు చేస్తామని తెలియజేశారు. ఇక బడ్జెట్లో తగ్గించే వాటిపైన కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టి మరి కొన్ని ప్రాంతాలకు భారీగా బడ్జెట్ను కేటాయించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. మరి ఈ పన్ను భారం ప్రజలు ఏ విధంగా ధరిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: