ఈ రోజున కేంద్ర బడ్జెట్ 2024-2025 సంబంధించి ప్రధాన నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ బడ్జెట్ని మొదటిసారి ప్రవేశపెడుతున్నారు.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఈసారి రాజధాని విషయంలో చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకోసం అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అందించినట్లుగా నిర్మల సీతారామన్ తెలియజేశారు.

బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం.. విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తామంటూ తెలియజేశారు.. వీటితోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఆంద్రప్రదేశ్ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాయం చేస్తాం.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాయం చేస్తామని.. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తామని.. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు.. వాటర్, పవర్, రైల్వే, రోడ్ల రంగంలో ఏపీకి అండగా నిలుస్తామని తెలియజేశారు నిర్మలా సీతారామన్.


 ఈశాన్య రాష్ట్రాల్లో 100 పోస్టల్ పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు.. ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక ప్యాకేజీ.. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంట్ స్కీమ్.. సులభంగా రుణం అందేలా చర్యలు.. ముద్ర రుణాలు రూ.10 నుంచి 20 లక్షలకు పెంపు.. 100 ఫుడ్‌ క్వాలిటీ ల్యాబ్స్ ఏర్పాటు.. 12 ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటు.. క్రిటికల్ మినరల్‌ మిషన్ ఏర్పాటు.. పట్టణాల అభివృద్ధికి  ప్రత్యేక కార్యాచరణ.. 30 లక్షలకు పైగా జనాభా ఉన్న 14 పట్టణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటూ నిర్మలా సీతారామ తెలియజేశారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ వంటిదని చెప్పవచ్చు. మరి ఈసారైనా రాజధాని ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం మీదకి వేసిన చంద్రబాబు మరియు సారి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: