ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళగా ఆమె పేరు లిఖించుకుంది. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రి స్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన 2వ వ్యక్తి నిర్మలా సీతారామన్‌ ని పేర్కొంటారు. అదే విధంగా పూర్తి స్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళగా సీతారామన్ ని కీర్తిస్తారు ఆర్ధిక వేత్తలు. 2019 నుండి ఆమె ఆర్థిక మంత్రిగా భాద్యతలు నిర్వహించింది. ఈ క్రమంలోనే 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించింది.

ఇక తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆమె ప్రవేశ పెట్టడం జరిగింది. ఇలా వరుసగా 7వ సారి ఆమె పద్దును ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించారు. 2019 మే 30 నుంచి ఆమె ఆర్థిక మంత్రిగా కొనసాగుతుండడం విశేషం. అదే ఏడాది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తర్వాత వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24 బడ్జెట్‌లు అందించడం జరిగింది. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరి 1న 2024-25కి సంబంధించి ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశ పెట్టగా తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

ఇలా ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్‌ పేరు మీదున్న రికార్డును నిర్మల సీతారామన్ తాజాగా చెరిపినట్టు అయింది. 1959 - 1964 మధ్య దేశాయ్‌ 5 పూర్తిస్థాయి, ఒక తాత్కాలిక బడ్జెట్‌ అలా వరుసగా ఆరుసార్లు ప్రవేశ పెట్టడం జరిగింది. తాజాగా ఆమె రికార్డుని నిర్మలా చెరిపి వేశారు. కాగా నిర్మల ఈసారి ఒక గంటా 22 నిమిషాల పాటు ప్రసంగించారు. 2020 ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆమె 2 గంటల 40 నిమిషాలు ప్రసంగించారు. ఇప్పటి వరకు ఇదే సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం అని చెప్పుకోవచ్చు. ఇక రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె తన స్పీచ్‌ను ముగించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: