ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను సైతం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా బడ్జెట్ ని కేటాయించారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా వెనుక పడడం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను సైతం దృష్టిలో పెట్టుకొని ఈసారి కేంద్ర బడ్జెట్ ని సైతం ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినా, మినిస్టర్ నారా లోకేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక విషయాన్ని తెలియజేశారు.


కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడం పైన నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వానికి నిర్మల సీతారామన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జీవనడి పోలవరం ప్రాజెక్టుల పైన పూర్తిగా సహకారం అందిస్తామని కేంద్రం ప్రకటించడంతో ఈ విషయం ఏపీ ప్రజలకు తమ పార్టీ నేతలకు కూడా ఆనందాన్ని కలిగిస్తోంది అంటూ తెలియజేశారు. బడ్జెట్లో ఏపీకి 15000 కోట్ల రూపాయలు కేటాయించడం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు అంటూ లోకేష్ తెలియజేశారు.


అమరావతి నిర్మాణానికి 15000 కోట్ల రూపాయలు అందించిన కేంద్రమంత్రి నిర్మల సీతారామ ప్రకటించడం జరిగింది..అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సంపూర్ణ సహకారంతోపాటు వెనుకబడిన రాయలసీమ ప్రాంతాలు ,ఉత్తరాంధ్ర ప్రాంతాలు, ప్రకాశం జిల్లాకు ప్రత్యేకమైన ప్యాకేజీలను కూడా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడి ప్రజలు సైతం ఆనందంగా కేంద్ర ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.. అయితే పోలవరం ప్రాజెక్టు లాంటిది ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని చూస్తూ ఉన్న ఇప్పటివరకు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడంతో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: