ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్ల‌నుంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్   బడ్జెట్  ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది పూర్తిస్థాయి బడ్జెట్టా..   లేక ఒటాన్ అకౌంటు బడ్జెట్టా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే పూర్తిస్థాయి బడ్జెట్ అంటే ఆగస్టు నుంచి వచ్చే మార్చి వరకు ఏడు మాసాల కాలానికి ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్. మళ్ళీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో కొత్త బడ్జెట్ ఎలాగూ వస్తుంది.


ఈ ఏడు మాసాల కాలానికి ప్రవేశపెట్టేదాన్ని ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ గా చెబుతున్నారు. అలా కాకుండా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే మూడు మాసాల కాలానికి మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటే  అది ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ గానే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసి, బడ్జెట్ కాపీలు కూడా సిద్ధం అయిపోయాయి. అసలు ఏ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు? ఏ బడ్జెట్ ప్రవేశపడితే ప్రభుత్వానికి ప్రయోజనం ఏంటి? నష్టం ఏంటి? అనేది చూడాలి.


ఇలా.. చూస్తే పూర్తి స్థాయి బడ్జెట్ అంటే ఏడు మాసాల కాలానికి కనుక ఇప్పుడు బడ్జెట్ పెడితే ప్రభుత్వంపై ఆర్థికంగా భారం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రకటించిన పథకాలను స్పష్టంగా ఈ బడ్జెట్ లో పెట్టాలి. అదేవిధంగా వాటికి కేటాయింపులు కూడా జరగాలి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయా పథకాలకు సహకరించే అవకాశం అయితే కనిపించడం లేదు. దీంతో ఏడు మాసాల కాలానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఇది స్పష్టం.


ఇక రెండోది ఓటాన్ ఎకౌంటు బడ్జెట్. అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు మాసాలకు సంబంధించి ప్రవేశ పెట్టేటటువంటి బడ్జెట్. దీనిలో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకపోయినా సంక్షేమ పథకాల ప్రస్తావని లేకపోయినా అడగాల్సిన అవసరం కానీ అడిగే అవసరం కానీ ఎవరికి ఉండదు. ఇది  తాత్కాలిక అవసరాలు. రెవెన్యూ ఖర్చులు, అప్పులకు వడ్డీలు, శాఖలకు సంబంధించిన నిధులు కేటాయింపుతో సరి పెట్టవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు ఈ వ్యూహాన్ని ఎంచుకొని ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ తీసుకొని సాగుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి కార్నర్ చేశారు. అంటే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. కానీ పూర్తిస్థాయి బడ్జెట్  ప్రవేశ పెట్టేందుకు అవసరమైన నిధులు లేకపోవడం ప్రస్తుతం కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ కాకుండా మూడు నెలలకు మాత్రమే పరిమితమైనట్టు టిడిపి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది సంగతి!!

మరింత సమాచారం తెలుసుకోండి: