ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర బ‌డ్జెట్ పెద్దపీట వేసింది. బడ్జెట్ లో వరాల జల్లు కురిపించింద‌నే చెప్పాలి. ఇక ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రాజధాని అమరావతి నిర్మాణంకు క‌నివినీ ఎరుగ‌ని రీతిలో రు. 15 వేల కోట్ల సాయం చేయనుంది.. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  క్లారిటీ ఇచ్చేశారు. రెండు కీల‌క‌మైన ప్రాజెక్టుల‌కు కేంద్రం భారీ మొత్తంలో సాయం చేస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో ఇక ఏపీ ప్ర‌జ‌ల ఆనందాల‌కు అవ‌ధులు లేవు. అటు కూట‌మి ప్ర‌భుత్వం కూడా పెద్ద స‌క్సెస్ సాధించిన‌ట్టుగానే భావించాలి.


ఈ క్ర‌మంలోనే రాయలసీమ, ప్రకాశం, కోస్తా ఆంధ్రలలో వెనుకబడిన జిల్లాలకు ఆర్ధికసాయం కూడా అందిస్తామ‌ని చెప్పారు. ఇక బ‌డ్జెట్ కేటాయింపుతో కూట‌మి లో ఉన్న మూడు పార్టీల‌కు చెందిన ఆంధ్రా నేత‌లు అంద‌రూ ఖుషీ ఖుషీ గానే ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి విష‌యంలో కేవ‌లం నెల రోజుల్లోనే చంద్ర‌బాబు సాధించిన పెద్ద స‌క్సెస్ గానే దీనిని చూస్తున్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందుగానే చంద్ర‌బాబు ప‌దే ప‌దే ఢిల్లీకి వెళ్లారు.


అక్క‌డ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో పాటు అమిత్ షా .. ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను క‌లిసి వ‌చ్చారు. ఏపీ అభివృద్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చంద్రబాబు అభ్యర్థించారు. కేంద్రం కూడా అందుకు సానుకూలంగా స్పందించి పెద్ద మొత్తంలో నిధుల విడుదలకు హామీ తీసుకువ‌చ్చారు. ఏపీకి కేంద్రం ఇంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో అంద‌రూ స్వాగ‌తిస్తున్నారు. అయితే ఈ బ‌డ్జెట్ పై ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ స్పందించ‌క పోవ‌డం కాస్త ఆశ్చ‌ర్య క‌రంగానే క‌నిపిస్తోంది.


వైసీపీ అస‌లు ఎందుకు నోరు విప్ప‌డం లేద‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఎన్డీయేకు వ్యతిరేకంగా పెదవి విరిస్తే కేంద్ర పెద్దల ఆగ్రహానికి గురి అవుతామని.. ఇది జ‌గ‌న్ పై కేసులు తిరిగి తెర‌మీద‌కు వ‌చ్చేందుకు కార‌ణ మ‌వుతుందా ? అన్న టెన్ష‌న్ అయితే వాళ్ల‌కు ఉంది. అందుకే వైసీపీ సైలెంట్ గా ఉంటుందా..? అనే అనుమానాలు కూడా క‌నిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: