- కొత‌గా మూడు ప‌థ‌కాలు ప్ర‌క‌టించిన నిర్మ‌ల‌మ్మ‌
- మేకిన్ ఇండియా ల‌క్ష్యంగా ఉత్ప‌త్తి రంగంలో ఉపాధి
- రెండేళ్ల పాటు రు. 3 వేలు ఈపీఎఫ్ఓ రిజయింబర్స్

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం కొత్త బ‌డ్జెట్ లో ఏపీకి వ‌రాల జ‌ల్లు కురిపించింది. ఈ క్ర‌మంలోనే కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి కూడా ప్ర‌భుత్వం తాజా బ‌డ్జెట్ నేప‌థ్యంలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పథకాలను ప్రకటించారు. ఈ క్ర‌మంలోనే ఉద్యోగ భవిష్య నిధి ఆధారంగా ఈ పథకాలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.


ఇక ఉద్యోగంలో ఫ‌స్ట్ టైం చేరిన వారిని ఎంక‌రేజ్ చేసేలా ఓ నెల వేతనం అందిస్తామని కూడా నిర్మల‌మ్మ స్ప‌ష్టం చేశారు . అయితే దీనిని ఏ ఒక్క రంగానికి మాత్రమే దీనిని పరిమితం చేయకుండా అన్ని రంగాలకు విస్తరింపజేస్తామని కూడా ఆమె తెలిపారు. ఇక ఈ ప‌థ‌కంలో భాగంగా గరిష్టంగా 15 వేలు అందిస్తామని.. వాటిని వాయిదా పద్దతిలో మూడు సార్లు చెల్లిస్తామన్నారు.


ఇక మేకిన్ ఇండియా లక్ష్యంగా ప్ర‌వేశ పెట్టిన రెండో పథకం లో భాగంగా ఉత్పత్తి రంగంలో ఉపాధిని క్రియేట్ చేయడమే ధ్యేయంగా చేస్తారు. తొలిసారి ఉద్యోగంలో చేరిన వారితో పాటు యాజమాన్యాలకు కూడా ఈ ప్రోత్సాహం అందిస్తారు. ఇక ఉద్యోగం క‌ల్పించిన‌ప్ప‌టి నుంచి నాలుగేళ్ల వ‌ర‌కు ఈ ప్రోత్స‌హ కాలు ఉంటాయి . దీనిని లక్ష వేతనం ఉన్న వారికి వర్తింపజేస్తారు. ఇక అద‌న‌పు ఉద్యోగాలిచ్చిన యాజ‌మాన్యాల‌ను ఎంక‌రేజ్ చేసేలా రెండేళ్ల పాటు రు. 3 వేల వ‌ర‌కు ఈపీఎఫ్ఓ రిజయింబర్స్ చేసేలా మూడో పథకం ఉంటుంది. ఈ ప‌థ‌కంలో మొత్తం 50 ల‌క్ష‌ల మందికి ల‌బ్ది క‌లుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: