కేంద్ర బడ్జెట్ సమావేశాలు మొదలైపోయాయి. సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక బడ్జెట్ వస్తుందని అందరూ ఆశించారు. వారు ఆశించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇదే తరుణంలో  కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్  ఓవైపు ఆంధ్ర ప్రదేశ్   మరోవైపు బీహార్ కు పెద్దపీట వేశారని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా  బాబు ప్రస్తావించినటువంటి అమరావతి,  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి  పెద్దపీట వేయాలని అన్నారట. దానికి అనుగుణంగానే అమరావతి రాజధాని నిర్మాణానికి ముందుగా పదిహేను వేల కోట్లు కేటాయింపులు చేశారు.  అంతేకాకుండా అతిపెద్ద ప్రాజెక్టు అయినటువంటి పోలవరం నిర్మాణానికి కూడా పూర్తి సహకారం అందిస్తామని  బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలియజేశారు. 

అలాగే విశాఖ మరియు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి కూడా నిధులు,  ఐటీ కంపెనీలు,  ఇతర ఇండస్ట్రీలు తీసుకువచ్చేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీకే ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు జరిగాయని తెలుస్తోంది. బడ్జెట్ లో ఏపీకి మంచి ఫలితాలు రావడంతో ఈ క్రెడిట్  ఎవరిది అనేదానిపై ఇటు టిడిపి మరోవైపు జనసేన వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో కొంతమంది నాయకులు ఈ క్రెడిట్ అంతా జనసేన పవన్ కళ్యాణ్ దే అంటూ  చెప్పుకొస్తున్నారు. ఆయన లేకుంటే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చేది కాదని,  పవన్ నష్టపోయిన మంచిదే కానీ అధికారంలోకి రావాలని చూసారని ఆయన ఆ విధంగా జతకట్టి బిజెపిని కూడా కూటమిలో కలిపారని ఇదంతా పవన్ వల్లే సాధ్యమైందని అన్నారు.

ఆయన  టాలెంట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా గుర్తించారని కామెంట్లు పెడుతున్నారు.  బడ్జెట్ లో పవన్ వల్లే ఏపీకి  ప్రత్యేక నిధులు వస్తున్నాయని జనసేన నాయకులు అంటుంటే మరోవైపు టిడిపి నాయకులు కూడా  చంద్రబాబు తెలివి వల్లే ఇంత బడ్జెట్ ఏపీకి వస్తుందని, ఆయన లేకుంటే పవన్ ఉండేవారు కాదని చెప్పుకొస్తున్నారు.  జనసేన మరియు టిడిపి తమ్ముళ్లు మా నాయకుడు ఎక్కువ అంటే, మా నాయకుడు ఎక్కువ అంటూ బడ్జెట్ విషయంలో చర్చిస్తూ సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: