- సీతమ్మ బడ్జెట్ ఖరారు
- ఏపీకి నిధులు అంతగా ఆకట్టుకోలేదు.
- పోలవరానికైనా ప్రత్యేక సహకారం ఉంటుందా.?


 మోడీ ప్రభుత్వం  కొలువుదిరిన తర్వాత మొదటిసారి బడ్జెట్ సమావేశాలు జరిగాయి. దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు మరియు యువతకు మేలు కలిగేలా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని చెప్పవచ్చు.  ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకంగా నిధులు కేటాయింపులు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి జరిగిన మేలు తెలంగాణకు జరగలేదని చెప్పవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో  ఏపీకి సంబంధించినటువంటి అనేక అంశాలు పొందుపరిచారు.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు కీలకమైనటువంటి ఘట్టాలు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల పరిస్థితి మారాలి అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. ఈ ప్రాజెక్టు విషయమై ఇప్పటికే కొన్ని  పర్యాయాలు గడిచాయి.


 ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం భారీ బడ్జెట్ తో కూడిన ప్రాజెక్టు. అందుకే ఈ ప్రాజెక్టు వైపు రాష్ట్రంలో ఏ సీఎం కూడా చూడడం లేదు.  దీంతో ఈసారి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా టిడిపి కూటమి ప్రభుత్వం కీలకంగా ఉంది. చంద్రబాబు బిజెపి ఎన్డీఏలో ఉన్నాడు.  ఇదే తరుణంలో ఏపీకి అద్భుత బడ్జెట్ తీసుకురావడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మరికొంతమంది ఎంపీలు  అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. దీంతో వారి ప్రయత్నాలు కూడా ఫలించాయని చెప్పవచ్చు.  ఇవాళ నిర్మలమ్మ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మరి ఏపీకి ఎంత వచ్చింది. ఆమె ఆంధ్రప్రదేశ్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసింది అనే వివరాలు చూద్దాం.

 ఏపీకి బడ్జెట్:
 ముఖ్యంగా మోడీ 3.0 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏపీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి బడ్జెట్ కేటాయింపులు చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎంతో అవసరమని, గత పదేళ్లలో నిర్మించేది ఉండే కానీ నిర్మించలేకపోయారని, తక్షణమే ఈ నిర్మాణానికి కేంద్రం సహకారం కూడా అందిస్తుందని  తెలిపింది. అంతేకాదు తక్షణ బడ్జెట్ కింద రూ:15వేల కోట్లను కూడా కేటాయింపులు చేసింది.  అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుంది.  ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కేంద్రం ఈ నిర్మాణానికి ఎంతో సహకారం అందిస్తుందని నిర్మలమ్మ చెప్పింది. ఇంకా ఇదే కాకుండా పలు రకాల పరిశ్రమలకు కూడా సహకారం అందిస్తామని అన్నది. రాజధానికి సంబంధించిన బడ్జెట్ మాత్రం కేటాయించబడింది కానీ, పోలవరానికి మాత్రం కేటాఇస్తామని చెప్పారు.  కానీ ఎంత కేటాయిస్తారు. రాష్ట్ర బడ్జెట్ లో ఏమైనా పోలవరానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారా?అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: