- ఏపీ ఆశలు ఆవిరి.!
- పథకాల అమలు ఎలా మరీ.!
బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయింది. ఈ ఏడాది ఇంకా ఎనిమిది నెలల కోసం మాత్రమే బడ్జెట్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ కు అత్యధికంగా పెద్ద పీట వేస్తారని రాష్ట్రమంతా భావించారు. కానీ వారు అనుకున్న విధంగా ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించలేదు. దేశమంతా సమన్యాయం చేశారని చెప్పవచ్చు. అలా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో చంద్రబాబు ఆశించినంత ఫలితం మాత్రం దక్కలేదు. ఈ తరుణంలో ఆయన తలకు మించినటువంటి పథకాలు అమలు చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కేంద్ర సహకారం కూడా సరైన పద్ధతిలో అందకపోవడంతో ఈ పథకాలు ఆయన ఎలా అమలు చేస్తారనేది సవాలుగా మారనుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
బడ్జెట్ తక్కువ పథకాలు ఎక్కువ:
ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 1500 రూపాయలు, తల్లికి వందనం, రైతులకు మేలు, ఇలా అనేక పథకాల విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఎన్నికలకు ముందు ఇచ్చిన పథకాలు ఎప్పుడు ఎప్పుడు అమలు అవుతాయని ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో అమరావతి రాజధాని నిర్మాణం కావాలి మరియు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కావాలి. ఇలా ఇవన్నీ పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తవ్వాలి అంటే తప్పక ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కావాలి.