* రాష్ట్ర బడ్జెట్ మరో రెండు నెలలకు వాయిదా..ఆర్ధిక ఇబ్బందులే కారణమా ..?

* ఉచిత హామీలకే సగం నిధులు ఖర్చు ..ఇక అభివృద్ధి పరిస్థితేమిటో ..?

* సామాన్యుడిని సంతృప్తి పరిచే బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం కసరత్తు ..




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు కీలక సంస్కరణలు చేసింది.ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది.ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటించి ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న చంద్రబాబు త్వరలోనే మిగిలిన హామీలు సైతం అమలు చేయనున్నారు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.జులై 22 న ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి.ఈ సమావేశాలలో కూటమి ప్రభుత్వం మరో రెండు నెలలకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.ఆర్థిక ఇబ్బందులతో ప్రస్తుతం బడ్జెట్‌ ప్రవేశపెట్టలేని పరిస్థితి ఏర్పడిందని తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు నెలలు సమయం తీసుకుని వార్షిక బడ్జెట్ ను పెట్టాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. వికసిత్ భారత్‌ 2047తో ప్రపంచంలోనే తొలి రెండు స్థానాల్లో ఇండియా నిలుస్తుందని చంద్రబాబు తెలిపారు. వికసిత్ భారత్‌ వైపు దేశం అడుగులు వేస్తోందని విజన్ 2020 తయారుచేశాక అభివృద్ధి మొదలైందని చంద్రబాబు అన్నారు.


అలాగే నేటి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడంతో మోడీ సర్కార్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.అయితే గత ప్రభుత్వం  రాజధానిని అస్సలు పట్టించుకోలేదు.మూడు రాజధానులు అనే డ్రామా ఆడి అమరావతి నిర్మాణాన్ని నిర్వీర్యం చేసారని చంద్రబాబు విమర్శించారు.అయితే రాష్ట్రంలో గత వైసీపీ ఇచ్చిన హామీల కంటే కూటమి ఇచ్చిన హామీలకు భారీగా నిధులు కావాలి.దీనితో బడ్జెట్ కూర్పు కూటమికి కత్తి మీద సాములాగా మారింది.ఉచిత పధకాలకు సగం నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే కేంద్ర నిధులతో ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది.రెండు నెలల తరువాత సామాన్యుడు హర్షించే బడ్జెట్ ప్రవేశ పెడతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: