నిన్నటి రోజున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది.. ఇందులో ఏపీకి కేటాయించిన బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు.. విజయవాడలో ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన ఫైర్ అయ్యింది.. లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చి కేవలం చేతులు దులుపుతున్నారు అంటూ విమర్శిస్తోంది.. ఇలా బడ్జెట్ పూర్తి అయిన వెంటనే సెన్సెక్స్  1200 పాయింట్లకు పడిపోయింది అంటూ తెలిపారు.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని బడ్జెట్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదంటూ తెలియజేసింది షర్మిల.




పోలవరం ప్రాజెక్టులను సైతం పూర్తి చేసే బాధ్యతలను కూడా కేంద్రానికి ఉంటుంది అంటూ నిర్మలా సీతారామన్ చెప్పారు. 12 వేల కోట్ల పునరావాసానికి అవసరమని ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు. ఎప్పుడు పూర్తి చేస్తారు ఎంత డబ్బులు కేటాయించాలి అనే విషయం పైన కూడా బడ్జెట్లో ఒక్కమాట కూడా చెప్పలేదు.. అలాగే కర్నూల్, కోపర్తి వద్ద ఇండస్ట్రీ హబ్బుగా ఎంత ఇస్తారు అనే విషయం పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బడ్జెట్ అంటే కేవలం అంకెలకు సంబంధించిన  అంకెగా మిగిలిపోయింది.. అలాగే వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఎంత ఇస్తారు అనే విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు అంటూ తెలిపింది. అసలు కేంద్రం ఎంత ఇస్తుందో టిడిపి జనసేనకి ఏమైనా తెలుసా అంటూ ఆమె ఫైర్ అయ్యింది.


ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి చాలా కీలకమని వీటి గురించి బడ్జెట్లో ఏమాత్రం ఆలోచించకుండా సంబరాలు చేసుకుంటున్నారు అంటూ ఫైర్ అయ్యింది. బీహార్ కి ఇవ్వడం లేదని కేంద్రం చెప్పేది.. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి బీహార్ కి ఇస్తారో లేదో అది బిజెపి వాళ్ళ ఇష్టం కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తీరాల్సిందే ప్రత్యేక హోదా అంటూ తెలిపింది. లేకపోతే అసలు ఇండస్ట్రీ లే రావు 15,000 వేల కోట్ల ముష్టిపడేస్తే మేము పండగ చేసుకోవాలా అసలు ఎందుకు చేసుకోవాలి అంటూ ఫైర్ అయ్యింది .టిడిపి 16 మంది ఎంపీలు ఒక్కొక్కరిని 1000 కోట్లు బిజెపి కొనుక్కుందాం అంటూ ఫైర్ అయ్యింది. పదేళ్ల నుంచి ఏపీని మోసం చేస్తూనే ఉన్నారు బిజెపి అంటూ ఫైర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: