కేంద్రంలో మూడోసారి అధికారాన్ని దక్కించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. నిర్మల సీతారామన్ ఇటీవల పార్లమెంట్లో జరిగిన బడ్జెట్ సమావేశాలలో ఇక కేంద్ర బడ్జెట్ను పూర్తిగా చదివి వినిపించారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎండీఏ ప్రభుత్వం ఏర్పడటంలో కీలకంగా ఏపీకి  బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగబోతున్నాయి అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఒకరకంగా మునుపటితో పోల్చి చూస్తే ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి వరాల జల్లు కురిసింది అని చెప్పాలి.



 ఏకంగా రాజధాని అమరావతి అభివృద్ధికి 15వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇక మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతన పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే మొత్తాన్ని గ్రాండ్ ల రూపంలో ఇవ్వాలా.. లేదంటే అప్పుగా ఇవ్వాలా అన్న విషయాన్ని చర్చిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనన్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. అయితే ఇలా కేంద్ర బడ్జెట్లో ఏపీకి మంచి కేటాయింపులు జరిగాయి అని చెప్పాలి.


 కాగా నేడు ఏపీ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి బోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ఇచ్చిన నిధులతో అటు చంద్రబాబు ఎలాంటి చిట్టాపద్దుల తయారు చేశారు. ఏ ఏ రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే గతంతో పోల్చి చూస్తే వ్యయం మరింత భారీగా పెరుగుతుంది అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు నేర్పించడంలో చంద్రబాబు ఆదాయ కల్పన ఎలా చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే పెట్టుబడులను ఏపీకి రప్పించడం పైనే బాబు ప్రత్యేక దృష్టి పెట్టారట. ఇలా పెట్టుబడులను ఆకర్షించేందుకు బడ్జెట్లో కొన్ని మినహాయింపులతో కూడిన సంస్కరణలను సిద్ధం చేశారని.. ఇక నేడు బడ్జెట్ సమావేశాలలో వాటిని ప్రకటించబోతున్నారు అన్నది తెలుస్తుంది. పెరగనున్న వ్యయాలకు అనుగుణంగానే ఆదాయ కల్పన చేసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఇలా పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉపాధి కల్పన కోసం చంద్రబాబు బడ్జెట్లో ఎలాంటి సంస్కరణలు సిద్ధం చేశారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: