* ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ల ప్రారంభం
* రూ.5కే రుచికరమైన భోజనం
* 200 లకు పైగా అన్నా క్యాంటీన్లు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇవాళ బడ్జెట్  సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే...  ఏపీ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అయితే ఈసారి... ఓటాన్ అకౌంట్  బడ్జెట్ ప్రవేశ పెట్టబోతుందట తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిన్నపాటి బడ్జెట్లో... ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం కూటమి పార్టీలో  ప్రకటించిన సూపర్ సిక్స్  పథకాలు అమలు చేయడం కష్టమే.

 మెజారిటీ పథకాలను మాత్రం.. చంద్రబాబు ప్రభుత్వం.. అమలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్న క్యాంటీన్ లను పునరుద్ధరించడానికి... కంకణం కట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఈసారి బడ్జెట్లో భారీగా నిధులు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీ లేదా ఆగస్టు 10వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట.

 అందుకే ఈసారి బడ్జెట్ లో... అన్న క్యాంటీన్లో కార్యక్రమం  ఉండబోతుంది. దాదాపు 200కు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించనున్నారు. ఐదు రూపాయలకే.. పోషకాల తో ఉన్న ఆహారాన్ని..  2014 నుంచి అమలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి.

 అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా... అన్న క్యాంటీన్ లను పునరుద్ధరిస్తోంది. దీనికోసం టెండర్లను పిలువనున్నారట.  గతంలో అక్షయ పాత్ర సంస్థ... ఈ కార్యక్రమాన్ని ఇచ్చే పట్టింది. ఇప్పుడు...  అదే సంస్థ తక్కువ ధరకు టెండర్ వేస్తే కచ్చితంగా వాళ్లకే వెళ్ళనుంది. ఏదేమైనా... అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం మాత్రం..  ఏపీ ప్రజలకు మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: