ఆంధ్రప్రదేశ్ కి గత కొన్నేళ్ళగా  రాజధాని లేదనే విషయం ఎన్నోసార్లు చాలా మంది నేతలు, ప్రజలు కూడా విమర్శించారు. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందుకు చెప్పి గెలవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గట్టుగా నిధులను మాత్రం విడుదల చేయలేదు. వాస్తవానికి అమరావతి రాజధాని పూర్తి చేయవలసిన బాధ్యత కూడా కేంద్రానిదే ఎందుకంటే గతంలో విభజన చట్టంలో ఇది చాలా క్లియర్ గా ఉన్నది. అయినప్పటికీ పదేళ్లుగా ఏపీకి రాజధానినే లేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 16 మంది టీడీపీ ఇద్దరూ జనసేన ఎంపీలు కూటమిలో భాగంగా పంపించారు.


మరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుతో కీలకంగా మారిన టిడిపి జనసేన కేంద్రం నుంచి ఏమి ఇస్తుంది ఎలా రుణం తీర్చుకుంటుందని చర్చించుకుంటున్న సమయంలో ఏపీకి రుణం ఇప్పించడమే గొప్ప అని కేంద్రం అనుకున్నట్లుగా భావిస్తోంది. అయితే నిన్నటి రోజున అమరావతి రాజధానికి 15 వేల కోట్లు నిధులు ఇచ్చారు అంటూ టిడిపి జనసేన ఒకవైపు ఆనందాన్ని తెలియజేస్తున్నప్పటికీ కానీ కేంద్ర ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడినప్పుడు అసలు విషయం బయటపడింది.


ప్రపంచ బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం అందించేలా చూస్తామని చెప్పారు. ప్రపంచ బ్యాంకు అంటే రుణాలు ఇచ్చేది తప్ప ఉచితంగా ఎక్కడ ఉండదు.. మరి ఈ విధంగా ఆలోచిస్తే ఏపీకి 15,000 కోట్ల రూపాయలు కేవలం అప్పుగా మాత్రమే ఆర్థిక సహాయం చేస్తుంది. తప్ప కేంద్ర ప్రభుత్వం సహాయం చేసేది ఏమీ లేదని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఏపీ తన వాటా భరిస్తుందా లేదా అనే విషయం చూడాల్సి ఉన్నది. ఈ విషయం తెలిసిన చాలా మంది ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు మోసం చేస్తోంది మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేస్తుందా కూటమి నేతలు ఏం చేస్తోంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: