ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకింత భారీ స్థాయిలోనే అప్పులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి సమయానికి ఏపీ అప్పు 11 లక్షల కోట్ల రూపాయలు అని ప్రచారం జరిగింది. ఆ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల భారం కూడా అంతాఇంతా కాదు. బాబు చేతుల్లోనే ఏపీ భవిష్యత్తు ఉందని చాలామంది భావిస్తున్నారు. ఏపీ అప్పులను చంద్రబాబు వీలైనంత తగ్గించాలని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
కేంద్రం నుంచి ఏపీకి 15000 కోట్ల రూపాయల మొత్తం గ్రాంట్ రూపంలో అందనున్న నేపథ్యంలో ఏపీ ఆర్థిక కష్టాలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో గ్రాంట్ల రూపంలో మరింత ఎక్కువ మొత్తం ఏపీకి దక్కితే రాష్ట్ర అభివృద్ధి ప్రజలు కోరుకున్న విధంగా శరవేగంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో బాబు వ్యూహాలు ఎలా ఉండనున్నాయో చూడాలి.
 
మరోవైపు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ సైతం కొనసాగుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి నుంచి స్పష్టత వచ్చేసింది. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం పెంచే దిశగా కూడా అడుగులు పడనున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడే విషయంలో మాత్రం బాబును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీ అప్పులను తగ్గించడానికి, ఏపీకి మరింత బెనిఫిట్ కలగడానికి చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. అనుభవం, ముందుచూపు ఉన్న నేత కావడంతో చంద్రబాబు నాయుడు క్లిష్టమైన సవాళ్లను ఏ విధంగా పరిష్కరిస్తారనే చర్చ జరుగుతోంది. ఏపీపై చంద్రబాబు పాలనలో రుణ భారం పెరిగితే మాత్రం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రశంసలు అందుకోవాలని బాబు అభిమానులు కోరుకుంటున్నారు. చంద్రబాబు ముందు ఉన్న సవాళ్లు భారీ సవాళ్లేనని చెప్పవచ్చు. వాటిని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: