రేపు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టనున్నారు. రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా మౌలిక సదుపాయాలకు ఏ స్థాయిలో ప్రాధాన్యతను ఇస్తారా అని దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఇప్పటికే 10 సంవత్సరాలు అవుతుంది.

ఈ పది సంవత్సరాల కాలంలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. దానితో చంద్రబాబు నాయుడు మొదటి దఫా గెలిసిన సమయంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయించాడు. కొన్ని కట్టడాలను కట్టించి కొన్ని వసతులను కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. కాకపోతే ఆ తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

వైసిపి అధికారంలోకి వచ్చాక అమరావతిపై  అంతగా శ్రద్ధ చూపలేదు. ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించాడు. అలాగే దానిని అద్భుతమైన స్థాయిలో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక అమరావతిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలి అంటే అక్కడ అనేక మౌలిక సదుపాయాలను కల్పించవలసి ఉంటుంది.

మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు , రైల్వేలు , వంతెనలు , సొరంగాలు , నీటి సరఫరా , మురుగు కాలువలు , విద్యుత్ గ్రిడ్లు మరియు టెలికమ్యూనికేషన్స్ , ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ తో సహా అనేక వసతులను ఇక్కడ మెరుగు పరచవలసి ఉంటుంది. వీటన్నింటినీ అద్భుతమైన స్థాయిలో మెరుగుపరచాలని అంటే అత్యంత ఎక్కువ బడ్జెట్ అవుతుంది.

మరి అంత మొత్తంలో బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మౌలిక సదుపాయాలకు కేటాయిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక మౌలిక సదుపాయాల అవసరం అమరావతి రాష్ట్రానికి ఎక్కువగా ఉంది ... కానీ మిగతా ప్రాంతాలకు కూడా అంత ఎక్కువ లేకపోయినా ఎంతో కొంత అవసరం ఉంది.

దీనితో పాటు ఇతర ప్రాంతాలకు కూడా మౌలిక సదుపాయాలకు బడ్జెట్ ను కేటాయించవలసి ఉంటుంది. మరి అంత మొత్తంలో బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు విడుదల చేయ బడ్జెట్ లో కేటాయిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: