ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రస్తుతం రాష్ట్రానికి ఆదాయం పెంచాల్సి ఉంది. ఎంత వేగంగా ఆదాయం పెరిగితే రాష్ట్రానికి అంత వేగంగా మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. పెట్టుబడులను ఆహ్వానించడం, ఉపాధిని పెంచడం మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయాన్ని పెంచడానికి సరైన మార్గమని చెప్పవచ్చు.
 
పెద్దపెద్ద సంస్థలకు భారీ రాయితీలు ఇవ్వడం ద్వారా మాత్రమే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు భారీ రిస్క్ లు తీసుకోవడానికి సిద్ధమైతే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు అలాంటి రిస్క్ లకు సిద్ధపడతారో లేదో చూడాల్సి ఉంది.
 
రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి చంద్రబాబు తన వంతు కృషి చేస్తే మంచిదని చెప్పవచ్చు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా అడుగులు పడితే మంచిదని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
చంద్రబాబు నాయుడు జ‌గ‌న్ ఏలుబ‌డిలో ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్న‌మైంద‌ని తాజాగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. రెండు నెల‌ల త‌ర్వాతే పూర్తిస్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడ‌తామ‌ని చంద్రబాబు చెప్పడం కొసమెరుపు. జగన్ సంక్షేమ పాల‌న పుణ్యాన ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింద‌ని చంద్రబాబు నాయుడు వెల్లడించడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాల్సి ఉంది.
 
రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌క‌పోతే చంద్రబాబు ఏం చేస్తారనే చర్చ సైతం జరుగుతోంది. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులు చంద్రబాబుకు అనుకూలంగా మారతాయో వ్యతిరేకంగా మారతాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలను చెప్పిన విధంగా అమలు చేస్తే మాత్రం ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: