ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ పరిస్థితి ఇప్పుడు... చాలా ఇబ్బందికరంగా మారింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓటమి పాలు కావడం.... అలాగే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. దీనికి తగ్గట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో రావడం.. వైసీపీ నేతలను టార్గెట్ చేయడం జరుగుతుంది.

 

అలాగే అడుగడుగున వైసిపి నేతలపై దాడులు కూడా జరుగుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలపై కొంతమంది కేసులు కూడా పెడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీలో కొంతమంది...  ఏక్ నాథ్ షిండేలు తయారవుతున్నారని... కార్యకర్తలు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి విషయంలో కూడా ఇదే జరిగిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వైసిపి నేత వాసుపల్లి గణేష్ కుమార్  కూడా తెలుగుదేశం పార్టీ టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.


అతి త్వరలోనే తెలుగు దేశం పార్టీకి మళ్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారట వాసుపల్లి గణేష్ కుమార్. గతంలో తెలుగు దేశం పార్టీ లోనే... చాలా రోజులు ఉన్నారు గణేష్ కుమార్. అయితే 2019 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన మనసు మార్చుకొని వైసీపీ  పార్టీ లో చేరిపోయారు. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఈగలు వస్తాయన్నట్లుగా... అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారు గణేష్ కుమార్.

 

గతంలో టిడిపిలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఈయన... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమిలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారట. ఈయనకు విద్య సంస్థలు,  అలాగే వ్యాపార సంస్థలు బాగానే ఉన్నాయి.  అయితే తన బిజినెస్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు...  రూట్ క్లియర్ చేసుకుంటున్నారట గణేష్ కుమార్. త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: